Renu Desai : చాలా ఏడ్చాను.. కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది.. రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

Renu Desai Gets Emotional రేణూ దేశాయ్ నిన్నటి నుంచి ఎక్కువగా వార్తల్లో ట్రెండ్ అవుతోంది. ఆమె మీద పవన్ కళ్యాణ్‌ అభిమానులు కామెంట్లతో దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. అకిరా బర్త్ డే కదా? ఫోటోలు, వీడియోలు షేర్ చేయొచ్చు కదా? మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది కదా? అని నెటిజన్లు అన్న మాటలకు రేణూ దేశాయ్ స్పందించింది

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2023, 06:26 PM IST
  • విడిపోయిన తరువాత రేణూ దేశాయ్‌పై ట్రోల్స్
  • మొదటి సారిగా ఇలాంటి మాటలు వింటోందట
  • ఏడ్చానంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్
Renu Desai : చాలా ఏడ్చాను.. కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది.. రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

Renu Desai Cries రేణూ దేశాయ్‌కి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన కొత్తలో అయితే ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువగా ఉండేది. పవన్ కళ్యాణ్‌ మూడో పెళ్లి చేసుకున్న అభిమానులు ఎలాంటి కామెంట్లు చేయలేదు. కానీ రేణూ దేశాయ్ మాత్రం రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరిగింది. రెండో పెళ్లి చేసుకుంటే.. అతడ్ని చంపేస్తామని కూడా ఫ్యాన్స్ బెదిరించిన సంగతి తెలిసిందే.

వదిన అని పిలుస్తూనే రేణూ దేశాయ్‌కి చుక్కలు చూపించారు. మనశ్శాంతి లేకుండా చేశారు. పవన్ కళ్యాణ్‌ తనకు అన్యాయం చేసినా కూడా ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడకుండా సైలెంట్‌గా విడాకులకు అంగీకరించిన రేణూ దేశాయ్‌ని అభిమానులు నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి.. ఇలా ట్రోలింగ్ చేస్తూనే వచ్చారు. ఈ నెగెటివ్ కామెంట్లు, ట్రోలింగ్ చూసి చూసి రేణూ దేశాయ్ విసుగెత్తి పోయింది.

తన పిల్లలిద్దర్నీ పెంచుకుంటూ తన బతుకేదో తాను బతికేస్తోంది. ఇలాంటి సమయంలో అకిరా బర్త్ డే అంటూ.. ఫోటోలు, వీడియోలు షేర్ చేయమని రేణూదేశాయ్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. తమ అన్న కొడుకు అని అన్నారు. దీంతో రేణూ దేశాయ్‌కి మండిపోయింది. మీ అన్న కొడుకు ఏంటి? అకిరా నా అబ్బాయి అంటూ కౌంటర్లు వేసింది. ఇలా నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్, రేణూ దేశాయ్ మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది.

Also Read:  Pawan Kalyan Fans : వేధిస్తున్న పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌.. రేణూ దేశాయ్ ఆవేదన.. అకిరా బర్త్ డే రచ్చ రచ్చ

తాజాగా రేణూ దేశాయ్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో సమాజం ఆడవాళ్ల మీద చూపిస్తున్న వివక్ష గురించి ఎంతో చక్కగా వివరించింది. హీరో హీరోయిన్లు విడిపోతే.. సమాజం ఎప్పుడూ హీరోయిన్లదే తప్పు అని వేలెత్తి చూపిస్తుందని రేణూదేశాయ్ గురించి ఎంతో గొప్పగా చెప్పింది. ఆమె ఎంతో మంచిది కాబట్టి.. పవన్ కళ్యాణ్‌కు శిక్ష పడకుండా కాపాడిందని, అలాంటి ఆవిడను పట్టుకుని ట్రోల్ చేస్తారా? ఆమె రెండో పెళ్లి చేసుకుంటాను అని తిడతారా? అదే మాట పవన్ కళ్యాణ్‌ను ఎందుకు అడగలేకపోయారు అని నిలదీసింది సదరు మహిళ.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

ఈ వీడియోను రేణూ దేశాయ్ చూస్తూ ఎమోషనల్ అయింది. నాకు ఈవిడ ఎవరో తెలీదు గానీ.. ఆవిడ నా గురించి ఎందుకు మాట్లాడిందో తెలియదు.. కానీ మొదటి సారి పబ్లిక్‌లో ఒకరు నా తరుపున మాట్లాడటం చూసి ఏడ్చాను.. నేను ఏదైనా చెప్తే నేను ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడుపోయాను అంటారు.. ఎలక్షన్స్ వస్తున్నాయని అంటారు.. నాకు ఈ వీడియో చూసి నా బాధ అర్ధం చేసుకునే వ్యక్తులు కూడా ఉంటారని ధైర్యం వచ్చింది అంటూ ఎమోషనల్ అయింది రేణూ దేశాయ్.

Also Read: Renu Desai-Pawan Kalyan Fan : మీ అన్న కొడుకా?.. అకిరా నా కొడుకు.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌పై రేణూ దేశాయ్ ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News