Renu Desai Emotional Post: అనుకోకుండా కొందరు జీవితంలోకి వస్తారు!.. రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

Renu Desai Emotional Post రేణూ దేశాయ్ తాజాగా కవిత్వం చెప్పింది. మామూలుగానే ఆమె ఓ రచయిత, దర్శకురాలు, తత్త్వవేత్త అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చెప్పిన కవిత్వం చూసి అంతా షాక్ అవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2023, 04:38 PM IST
  • నెట్టింట్లో రేణూ దేశాయ్ సందడి
  • కవిత్వం చెప్పిన పవన్ కళ్యాణ్‌ మాజీ భార్య
  • జీవితంలో అనుకోకుండా కొందరు వస్తారన్న రేణూ
Renu Desai Emotional Post: అనుకోకుండా కొందరు జీవితంలోకి వస్తారు!.. రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

Renu Desai Flight Journey: రేణూ దేశాయ్ ఒక్కోసారి సోషల్ మీడియాలో తన భావాలను కవిత్వం రూపంలో వర్ణిస్తుంటుంది. అందులో ఎన్నో నిగూఢ అర్థాలు కూడా ఉంటాయి. మండుటెండలో ఇలా చల్లని మేఘాల్లా మన జీవితంలోకి కొందరు అనుకోకుండా వస్తారు.. చూపుల్తోనే మన మనసుల్లో గుచ్చేస్తుంటారు.. మాట్లాడుతుంటారు.. అదొక అంతుచిక్కని మూగ భాషలా.. కొన్ని గంటలే వారి గడపొచ్చు గాక.. కానీ వారి ముద్ర, వారి ప్రభావం మనపై జీవితాంతం ఉంటుంది.. అయితే అందులోని చాలా ప్రయాణాలు బాధతో ఉండొచ్చు.. కానీ కొంత మంది మన జీవితాల్ని పరిపూర్ణం చేస్తారు.. మన కన్నీళ్లని తుడిచి మన జీవితంలో మరింత కాంతిని పంచుతారు. నవ్విస్తారు అంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

రేణూ దేశాయ్ వెకేషన్‌కు వెళ్లిందా..? ఫారిన్‌లో ఉంటోన్న అకిరా నందన్‌ను తీసుకురావడానికి వెళ్లిందా..? అన్నది క్లారిటీ లేదు. అకీరా నందన్ ఉన్నత చదువుల కోసం ఫారిన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అకిరా అలా చదువుల కోసం వెళ్తే.. ఆద్య, రేణూ దేశాయ్‌లు మాత్రం కాశ్మీర్ యాత్ర, కాశీ యాత్ర అంటూ ఇక్కడ బాగానే తిరిగేసింది. న్యూఇయర్‌కు ఆద్య, రేణూలు కాశ్మీర్ యాత్రలో ఉంటే.. అకిరా నందన్ మాత్రం ఖుషి రీ రిలీజ్‌ను ఎంజాయ్ చేస్తూ వచ్చాడు.

రేణూ దేశాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయింది. ఆ మధ్య కొన్ని రోజులు ఒక్క పోస్ట్ కూడా చేయకుండా ఫుల్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లింది. అకిరా నందన్‌ గురించి ఎక్కువగా అడుగుతుంటారని, పవన్ కళ్యాణ్‌ ప్రస్థావన తీస్తారని, అకిరా నందన్ పోస్ట్‌లకు కామెంట్ సెక్షన్లను మూసేస్తుంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

ఆ మధ్య అయితే రేణూ దేశాయ్ రెండో పెళ్లి మీద నానా హంగామా జరిగింది. రెండో పెళ్లి చేసుకుంటానని, చేసుకోబోతోన్నాను అని రేణూ దేశాయ్ ప్రకటించడంతో వెంటనే పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ వ్యతిరేకించారు. మీకు ధైర్యం ఉంటే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్‌ను అడగండి, ఆయన్ను మాత్రం ఇంకో పెళ్లి చేసుకోవద్దని ఎందుకు అడగడం లేదు.. నన్ను మాత్రం ఎందుకు అడుగుతున్నారు అని రేణూ దేశాయ్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను నిలదీసింది.

 Also Read: Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్

Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News