ఆయన ట్రెండ్ సెట్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మళ్లీ సిక్సర్ కొట్టారు.  అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ గా నిలిచిన తర్వాత .. ఆయన సినిమాలు వదిలేసి రాజకీయ ఆరంగేట్రం చేశారు. 

Last Updated : Mar 3, 2020, 05:03 PM IST
ఆయన ట్రెండ్ సెట్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత.. మళ్లీ సిక్సర్ కొట్టారు.  అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ గా నిలిచిన తర్వాత .. ఆయన సినిమాలు వదిలేసి రాజకీయ ఆరంగేట్రం చేశారు.  ఆ తర్వాత ఇన్నాళ్లకు 'పింక్' సినిమా రీమేక్ తో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే పవర్ స్టార్ తన స్టామినా చూపించారు.  వకీల్ సాబ్ గా వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ విడుదల కాగానే రికార్డులు బ్రేక్ చేసింది.  

నిన్న సాయంత్రం విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. పవర్ స్టార్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాదు.. #vakeelsaab హ్యాష్ ట్యాగ్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీట్వీట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 మిలియన్ల రీట్వీట్లు జరిగాయంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ  సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇంతలా రీట్వీట్ చేయలేదు. దీంతో పరిశ్రమ రికార్డులు బద్ధలవుతాయని ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Read Also: కరోనా వీడియోపై సారీ చెప్పిన ఛార్మి

మరోవైపు పవర్ స్టార్ కు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ శుభాకాంక్షలు  తెలిపారు. వెల్కమ్ బ్యాక్ బాబాయ్ అంటూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ కు రామ్ చరణ్ ముద్దు పెడుతున్న ఫోటోను పోస్ట్ చేశారు.

దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..తక్కువ రోజులే కాల్షీట్లు కేటాయించడంతో శర వేగంగా సినిమాను పూర్తి చేస్తున్నారు. మరోవైపు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొలి పాటను సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read Also: అలా చేస్తే కరోనా వైరస్ రాదు.. 

Trending News