Reasons behind Actress Jayashree Ramaiah suicide: జయశ్రీ రామయ్య ఆత్మహత్య కన్నడ సినీ పరిశ్రమలో కలకలంరేపింది. డిప్రెషన్ ప్రాణాలు హరిస్తుందని తెలుసు కానీ మరీ ఇంతలా జయశ్రీని యుక్త వయస్సులోనే చంపేస్తుందని అనుకోలేదని ఆమె సన్నిహిత మిత్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతేడాది జూలై 25న, జయశ్రీ తన ఫేస్‌బుక్ ఖాతాపై లైవ్ చేసింది. ఈ లైవ్ సందర్భంగా తన అభిమానులను, ఫాలోవర్స్‌ని ఉద్దేశించి మాట్లాడిన జయశ్రీ.. తాను పబ్లిసిటీ కోసం ఇదంతా చేయడం లేదని.. తాను Bigg Boss host Sudeep నుండి ఆర్థిక సహాయం కూడా ఆశించడం లేదని చెప్పుకొచ్చింది. నేను ఆర్థికంగా బలంగానే ఉన్నాను కాని ఈ డిప్రెషన్‌తో ( Battle with depression ) పోరాడలేకపోతున్నానని.., అనేక వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నానని జయశ్రీ ఆ లైవ్ వీడియోలో పేర్కొంది. చిన్నప్పటి నుంచీ మోసపోతున్నానని.. ఆ సమస్యను అధిగమించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేసిన జయశ్రీ... అందుకే ప్రస్తుతం తాను చావు కోసం ఎదురుచూడటం తప్ప ఇంకేం చేయడం లేదని వ్యాఖ్యానించింది.
Also read : Jayashree Ramaiah found dead: బిగ్ బాస్ బ్యూటీ Jayashree Ramaiah మృతి
ఆర్థికంగా బలంగానే ఉన్నానని చెప్పుకొచ్చిన జయశ్రీకి ఇలా అర్థాంతరంగా తనువు చాలించేంత పెద్ద కష్టం ఏమొచ్చిందో అర్థం కావడం లేదని ఆమె సన్నిహితులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయ్యింది. జయశ్రీ రామయ్య ఆత్మహత్యకు కారణాలు ఏంటి ? ఆమె బతుకుపై విరక్తి చెంది సూసైడ్ ( Jayashree Ramaiah's suicide mystery ) చేసుకుందా లేక ఎవరైనా ఆమెను ఆత్మహత్యకు ఉసిగొల్పారా ? ఆర్థిక ఇబ్బందులు లేవు కానీ వ్యక్తిగత సమస్యలతోనే సతమతమవుతున్నానని జయశ్రీ ( Jayashree Ramaiah ) చెప్పుకొచ్చింది. మరి ఆమెకున్న ఆ వ్యక్తిగత సమస్యలు ఏంటి ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook