Chiranjeevi: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు చిరంజీవిని పిలవలేదా?

Chiranjeevi Skips NTR Satha Jayanthi Utsavalu: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సంబంధించి చాలా మంది యంగ్ హీరోలకు ఆహ్వానాలు అందగా చిరంజీవిని ఆహ్వానించలేదని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : May 20, 2023, 05:35 PM IST
Chiranjeevi: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు చిరంజీవిని పిలవలేదా?

Chiranjeevi Not Attending NTR Satha Jayanthi Utsavalu: తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు తెలుగు వారంతా ఆంధ్రుల ఆరాధ్య దైవంగా భావించే నందమూరి తారక రామారావు జన్మించి ఈ ఏడాదికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.  తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఆ పార్టీ నేతలు ఎన్టీఆర్ శ్రేయోభిలాషులు, సన్నిహితులు నిర్వహిస్తూ వస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సంబంధించి చాలా మంది యంగ్ హీరోలకు ఆహ్వానాలు అందాయి. హైదరాబాదు కూకట్పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో జరగబోతున్న వేడుకకు చాలామంది కుర్ర హీరోలు హాజరు కాబోతున్నట్లు ఫ్లెక్సీలు కూడా పెట్టారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాలేనని మీడియా ముఖంగా అధికారికంగా వెల్లడించగా మరికొంతమంది హీరోలు కూడా పలు కారణాలతో ఈ వేడుకకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది.

Also Read: Manushi Chhillar Photos: ఉల్లిపొర లాంటి చిట్టి గౌనులో అన్నీ కనిపించేలా మానుషి చిల్లర్ హాట్ ట్రీట్!

అయితే ఇంత జరుగుతున్నా అసలు మెగాస్టార్ చిరంజీవిని ఈ వేడుకలకు ఎందుకు ఆహ్వానించలేదు అనే చర్చ జరుగుతోంది. అయితే నిజానికి మెగాస్టార్ చిరంజీవిని ఆరు నెలల క్రితమే ఈ నిర్వాహకులు ఈవెంట్ కి హాజరుకమ్మని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఆ తరువాత రీసెంట్ గా కూడా ఒకసారి కలిసి ఆయనను ఈ వేడుకకు హాజరు కమ్మని కోరారని అయితే తాను అప్పటికి అందుబాటులో ఉండలేనని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి హైదరాబాదులో లేరు ఆయన షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతంలో ఉండడంతో ఆయన ఈ వేడుకకు హాజరు కాలేనని చెప్పినట్లుగా తెలుస్తోంది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి కొన్నాళ్ల క్రితం భోళా శంకర్ సినిమా యూనిట్ తో కలిసి కలకత్తా షూటింగ్ కి వెళ్లారు. ఈ సినిమా షూటింగ్ కలకత్తాలోని గ్రాండ్గా జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆయన ఈ వేడుకలకు హాజరు కాలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. అయితే మరో ప్రచారం మేరకు ఆయన షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లినట్లుగా కూడా చెబుతున్నారు. కానీ ఆ విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద చిరంజీవిని పిలవలేదు అనే ప్రచారం అయితే నిజం కాదని అంటున్నారు.

Also Read: Ariyana Glory Photos: హద్దులన్నీ చెరిపేసిన అరియానా.. చిన్ని గౌనులో చేతులు పైకెత్తి థైస్, క్లీవేజ్ షో రచ్చ! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News