Raviteja Fans on Chiranjeevi: రవితేజ చిన్న హీరోనా? చిరుపై ఫాన్స్ ఫైర్!

Raviteja Fans Fires on Chiranjeevi: వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక సీన్ గురించి వివరిస్తూ ఒక పెద్ద హీరో ఒక చిన్న హీరోని ఇలా చేశాడు అంటూ చిరు పేర్కొనడంతో ఇప్పుడు రవితేజ అభిమానులు ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 29, 2023, 02:37 PM IST
Raviteja Fans  on Chiranjeevi: రవితేజ చిన్న హీరోనా? చిరుపై ఫాన్స్ ఫైర్!

Raviteja Fans Fires on Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా వాల్తేరు వీరయ్య సినిమా నిలిచింది. పూర్తి మాస్ సబ్జెక్టుతో బాబీ తెరకెక్కించిన ఈ కథ అటు మెగా అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు సినిమా మీద ఆసక్తి చూపించారు.

ఈ నేపథ్యంలోనే సినిమాకు వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్కెట్ టచ్ చేసిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు రాబడుతూ మున్ముందుకు దూసుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా యూనిట్ సక్సెస్ మీట్ వరంగల్ లో నిర్వహించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ముఖ్యఅతిథిగా, పలువురు ప్రతినిధులు అతిథులుగా హాజరైన ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రవితేజ పోస్టర్ నూ తన లుంగీ  తుడుస్తున్న ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ గురించి వివరిస్తూ ఒక పెద్ద హీరో ఒక చిన్న హీరోని ఇలా చేశాడు అంటూ ఆయన పేర్కొనడంతో ఇప్పుడు రవితేజ అభిమానులు ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలని తీసుకువెళ్లి సినిమాలో పెట్టుకుని ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఆయన చిన్న హీరో అయిపోయాడా? సినిమా చేస్తున్నంతసేపు ఆయన చిన్న హీరో అనే సంగతి గుర్తులేదా ? ఎందుకిలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే వాస్తవానికి చిరంజీవి రవితేజ తన సోదరుడు లాంటివాడని మొదటిసారి చూసినప్పుడే పవన్ కళ్యాణ్ లాగా అనిపించాడని అప్పటినుంచి తాను రవితేజలో పవన్ కళ్యాణ్ ని చూసుకుంటూ ఉంటానని చిరంజీవి చెబుతున్నారు.

అయితే రామ్ చరణ్ కూడా రవితేజ పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన అద్భుతమైన పర్ఫామెన్స్ చూసిన తర్వాత ఇక్కడితో చాలదు అని చెప్పి ధమాకా సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయితే చూశానని నాకు అంత బాగా రవితేజ క్యారెక్టర్ బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే అభిమానులు మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో ఏది పడితే అది మాట్లాడి ఉండకూడదని అంటున్నారు. తమ హీరోని తక్కువ చేసి మాట్లాడడం ఏమాత్రం బాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
Also Read: Taraka Ratna Health Update by NTR: తారకరత్న ఆరోగ్యం పై ఎన్టీఆర్ ప్రకటన..ఎక్మో లేదు కానీ!

Also Read: Jr NTR to Bangalore: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..బెంగళూరు బయలుదేరిన ఎన్టీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News