Ravi Krishna Clarity on Dating with Navya Swamy: సాధారణంగా సినీ పరిశ్రమలోనే కాదు టెలివిజన్ పరిశ్రమంలో కూడా ఎక్కువగా నటీనటుల పర్సనల్ జీవితాల గురించి తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ ఆర్టిస్టులతో పాటు టీవీ సీరియల్ ఆర్టిస్టుల మధ్య కూడా ప్రేమలు మొదలవడం, వారు పెళ్లిళ్ల వరకు వెళ్లడంతో దాదాపుగా కాస్త క్లోజ్ గా కనిపించే నటినటుల మధ్య ఏదో ఉందని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు.
ముఖ్యంగా టీవీ నటీనటుల విషయానికి వస్తే రవికృష్ణ, నటి నవ్య స్వామి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. వీరిద్దరూ కలిసి జంటగా కొన్ని సీరియల్స్ లో నటించారు. సోషల్ మీడియాలో కూడా చాలా క్లోజ్ గా ఉన్నట్టు వీరు కనిపిస్తూ ఉండడంతో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం అయితే ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తూనే ఉంటుంది.
Also Read: Anasuya Bharadwaj: మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్ధం చేసుకోండి.. మళ్ళీ అనసూయ సంచలన ట్వీట్!
ఇక ఈ మధ్యనే అటు నవ్య స్వామి ఇటు రవికృష్ణ ఇద్దరూ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నవ్య స్వామి అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రలో రూపొందిన బుట్ట బొమ్మ సినిమాలో ఒక టీచర్ పాత్రలో కనిపించగా రవితేజ రావణాసుర సినిమాలో కూడా కనిపించింది. ఇక రవికృష్ణ కూడా సీరియస్ గా సినిమాల్లో ప్రయత్నం చేస్తున్నారు. విరూపాక్ష సినిమాలో సంయుక్త మీనన్ సోదరుడిగా తండ్రి చావుకి పగ తీర్చుకునే వ్యక్తిగా రవికృష్ణ కనిపిస్తాడు.
వీరిద్దరి మధ్య జరుగుతున్న ప్రేమాయణం గురించి అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా రవికృష్ణ ఈ విషయం మీద స్పందించాడు. తన మధ్య ఆమె మధ్య ఎలాంటి ప్రేమాయణం నడవడం లేదని తాను సినిమాల్లో ప్రయత్నించడం కంటే ముందు తామిద్దరం కలిసి ఒక టీవీ సీరియల్ లో కనిపించామని చెప్పుకొచ్చారు. ఆ టీవీ సీరియల్ లో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిందని ఈ నేపథ్యంలోనే మేము రిలేషన్ లో ఉన్నామని ప్రచారం కూడా తెర మీదకు వచ్చి ఉండవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆమె తనకు మంచి స్నేహితురాలు మాత్రమే అని చెప్పకచ్చిన రవి కృష్ణ అంతకు మించి తమ మధ్య ఏమీ లేదనే విషయాన్ని కుండబద్దలు కొట్టేశాడు.
Also Read: Another Malayali: తెలుగులోకి మరో మలయాళ హీరోయిన్...వైష్ణవ్ తేజ్ సరసన ఎంట్రీ!