Sreeleela vs Rashmika Mandanna: రష్మిక మందన స్థానం కబ్జా చేసిన శ్రీలీల

Sreeleela replaces Rashmika Mandanna in Nithiin's film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోతోందో అందరికీ తెలిసిందే. కన్నడ నాట రెండు చిత్రాలు చేసిన అనంతరం పెళ్లి సందడి సినిమాతో 2021 లో తెలుగు ఆడియెన్స్‌కి పరిచయమైన శ్రీలీల.. ఈ సినిమా ఆశించినంత హిట్‌ని ఇవ్వకపోవడంతో మళ్లీ బ్యాక్ టు కన్నడ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 12, 2023, 07:45 PM IST
Sreeleela vs Rashmika Mandanna: రష్మిక మందన స్థానం కబ్జా చేసిన శ్రీలీల

Sreeleela replaces Rashmika Mandanna in Nithiin's film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోతోందో అందరికీ తెలిసిందే. కన్నడ నాట రెండు చిత్రాలు చేసిన అనంతరం పెళ్లి సందడి సినిమాతో 2021 లో తెలుగు ఆడియెన్స్‌కి పరిచయమైన శ్రీలీల.. ఈ సినిమా ఆశించినంత హిట్‌ని ఇవ్వకపోవడంతో మళ్లీ బ్యాక్ టు కన్నడ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఆ తరువాతి ఏడాది రవితేజ సరసన చేసిన ధమాకా చిత్రం శ్రీలీలకు ఎనలేని పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఎస్పెషల్లీ శ్రీలీల డాన్స్‌కి, తన ఒంపుసొంపుల నడుం ఊపుతూ ఎంతో అలవోకగా ఆమె వేసిన స్టెప్పులకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్‌ని వెతుక్కునే తెలుగు ఆడియెన్స్ ఈసారి శ్రీలీలలో తమ డార్లింగ్‌ని చూసుకున్నారు. 

శ్రీలీలకు అమాంతం వచ్చిన క్రేజుని క్యాష్ చేసుకునేందుకు దర్శకులు, నిర్మాతలు ఆమె కాల్షీట్స్ కోసం పోటీపడ్డారు. ఫలితంగా ఒకేసారి ఏడు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా బుక్కయిపోయింది. అందులో ఆదికేశవ, స్కంద సినిమాలు ఇప్పటికే పూర్తి కాగా.. జూనియర్, బాలయ్య బాబు హీరోగా వస్తోన్న భగవంత్ కేసరి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తోన్న గుంటూరు కారం, విజయ్ దేవరకొండ 12వ సినిమా (VD12), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్సాద్ భగత్ సింగ్ మూవీతో పాటు నితిన్ 32వ సినిమాలు ఉన్నాయి.   

వాస్తవానికి ఈ జాబితాలో ఉన్న నితిన్ 32వ సినిమాలో ముందుగా రష్మిక మందనను ఖరారు చేసుకున్నారు. ఈ జంట ఇప్పటికే భీష్మ మూవీలో కలిసి నటించారు. కాగా తాజాగా రష్మిక మందన స్థానాన్ని శ్రీలీల కబ్జా చేసింది అని తెలుస్తోంది. అవును.. రష్మిక మంధన స్థానంలో నితిన్ 32 మూవీ మేకర్స్ శ్రీలీలను తీసుకున్నారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఇదివరకు రష్మిక మంధనను హీరోయిన్‌గా అనుకోగా.. తాజాగా ఆమె స్థానంలో శ్రీలీల వచ్చి చేరినట్టు సమాచారం. కారణాలు ఏవైనా.. ఇది ఒక రకంగా రష్మిక మంధనకు ఇబ్బందికరమైన పరిణామమే. ఒకప్పుడు రష్మిక మంధన కూడా ఇలాగే పూజా హెగ్డే స్థానాన్ని కబ్జా చేస్తూ తెలుగు సినిమాను రాజ్యమేలింది. 

గీత గోవిందం మూవీ బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ అవడంతో సడెన్‌గా వచ్చిన నేమ్ అండ్ ఫేమ్ రష్మిక మంధనకు భారీ అవకాశాలు తెచ్చిపెట్టింది. తెలుగులో అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. ఆ క్రమంలో పూజా హెగ్డే ఒక్కొక్కటిగా అవకాశాలు కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు రష్మిక మంధనకు కూడా శ్రీలీల వల్ల సేమ్ ఫేట్ రానుందా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. రష్మిక మంధన స్థానంలో శ్రీలీలను తీసుకోవడం అనేది ఈ ఒక్క సినిమాతోనే పరిమితం అవుతుందా లేక రాన్రాను మొత్తానికే రష్మిక మంధనకు శ్రీలీల ప్రత్యామ్నాయంగా మారుతుందా అనేది గాసిప్ రాయుళ్ల నోట వినిపిస్తున్న మాట.

గాసిప్ రాయుళ్ల టాక్‌లో నిజం లేకపోలేదు. ఎందుకంటే పూజా హెగ్డే ఈమధ్యే రెండు పెద్ద సినిమాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో ప్రస్తుతం పూజా హెగ్జే చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఇది ఆమె కెరీర్‌కి పెద్ద మైనస్ పాయింట్. శ్రీలీల అప్‌రైజ్ కూడా పూజా హెగ్డే డౌన్‌ఫాల్‌కి ఒక కారణమైంది. ఇది చిన్నగామెల్లగా రష్మికపై కూడా ప్రభావం చూపిస్తుంది అనేది వారి అభిప్రాయం. గతంలో ఎందరో స్టార్ హీరోయిన్స్ ఇలా మెల్లమెల్లగా సైడ్ అవుతూ లైమ్‌లైట్‌లో లేకుండాపోయిన వారే కదా మరి.

Trending News