Vijay- Rashmika: విజయ్ ఫ్యామిలీ స్టార్ లో రష్మిక మందాన క్యామియో.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్

Family Star: గీతా గోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మ్యాజిక్ చేసిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందాన. ఆ తరువాత డియర్ కామ్రేడ్ చిత్రంలో కనిపించిన వీరిద్దరూ.. మళ్లీ ఏ సినిమాలో కలిసి నటించలేదు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలో వీరిద్దరూ  కలవబోతున్నారు అని వార్త వినిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2023, 07:57 PM IST
Vijay- Rashmika: విజయ్ ఫ్యామిలీ స్టార్ లో రష్మిక మందాన క్యామియో.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్

Vijay Devarkonda: ప్రస్తుతం రష్మిక మందాన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.  ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ మధ్య రష్మిక బాలయ్య అన్ స్టాబుల్ షోకి కూడా అటెండ్ అయింది. ఇక ఆ షోలో రష్మిక పరిణసిగ్గుకు పక్కన వారు చెప్పిన మాటలకు.. ఆమె నిజంగానే విజయ దేవరకొండ తో ప్రేమలో ఉండడం ఖాయమని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా ప్రకటించేస్తారని ఫిక్స్ అయిపోయారు అభిమానులు.

ఈ ప్రోగ్రాం ముందు వరకు వీరి ప్రేమ విషయం వీరిద్దరూ అసలు బయట పెడతారా లేదా అనే సందేహాలు ఉండేవి. కాగా ఈ షో అయ్యాక ..రష్మిక ఈ విషయం డైరెక్ట్ గా బయట పెట్టకపోయినా.. రష్మిక విజయ్ తో ప్రేమలో ఉన్నట్టు ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది అంటూ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

ఈ నేపథ్యంలో మరో ఒక వార్త విజయ్.. రష్మిక అభిమానులను తెగ ఖుషి చేస్తోంది. ఇంతకీ అదేమిటి అంటే మన విజయ్ తదుపరి సినిమాలో రష్మిక కామియో రోల్ చేయనుందట. రష్మిక, విజయ్ దేవరకొండ కలసి నటించిన మొదటి చిత్రం గీతా గోవిందం. ఆ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పరశురామ్ ఇప్పుడు మళ్లీ విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాలో రష్మిక కూడా కనపడనుందట.

ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నే తీసుకుంటారని వార్తలు వినిపించాయి.  ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈ ప్రాజెక్టులోకి మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఫ్యామిలీ స్టార్ లో రష్మిక మందన్న హీరోయిన్ గా కాకపోయినా క్యామియో మాత్రం ఉందట. తనకు టాలీవుడ్ లో అతి పెద్ద బ్రేక్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్. గీత గోవిందంతో జరిగిన మేజిక్ వల్లే రష్మిక తెలుగులో పుష్పాలాంటి సినిమా అందుకొని ప్రస్తుతం యానిమల్ లాంటి చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. పైగా విజయ్ దేవరకొండ హీరో అంటే రష్మిక కాదనే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ కామియో వార్త నిజమే అని తెలుస్తోంది. అయితే దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు

Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News