Rashmika Mandanna Open ups on Dating with Vijay Devarakonda: విజయ్ రష్మిక మందాన్నల డేటింగ్ మీద వచ్చినన్నీ రూమర్లు మరేతర జంట మీద కూడా వచ్చి ఉండవు. ఈ ఇద్దరూ ఒకే టైంలో వెకేషన్లకు కలిసి వెళ్లడం.. కలిసి సందడి చేయడం.. ఈ ఇద్దరూ ఒకే చోట ఉన్నారని చెప్పేందుకు నెటిజన్లు హింట్లు వెతకడం.. వారి కళ్లద్దాలను పరిశీలించడం.. వారు షేర్ చేసిన ఫోటోలను తీక్షణంగా పరిశీలించడం ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ కూడా ఈ డేటింగ్ రూమర్లపై నోరు విప్పింది లేదు.
అయితే తాజాగా రష్మిక మందాన్న మాత్రం తాజాగా ఈ రూమర్ల మీద స్పందించింది. ఆ రియాక్ట్ అయిన తీరును చూస్తే డేటింగ్ వార్తలు నిజమా..? లేదా..? అన్న అనుమానం మాత్రం జనాలకు లేదు. నేరుగా ఆ వార్తలను ఖండించనూ లేదు.. అవును నిజమే అని ఒప్పుకున్నట్టుగానూ లేదు. దీంతో జనాలకు మైండ్ బ్లాంక్ అయినట్టు కనిపిస్తోంది.
రష్మిక మందాన్న, విజయ్‌ల డేటింగ్ అనేది క్లియర్‌గా రుజువైంది.. విజయ్‌కి ఇష్టమైన ఆ ఉంగరం రష్మిక చేతికి వచ్చింది.. ఇద్దరూ ఒకే ఇంట్లో ఒకే రూంలో ఉంటున్నారు.. త్వరలోనే మనం శుభవార్త వినబోతోన్నామని ఓ మీడియా సంస్థ ట్వీటేసింది. దీనికి రష్మిక స్పందించింది. అయ్యో బాబు.. దాని గురించి నువ్ ఎక్కువగా ఆలోచించకు అని నవ్వేసింది.
Also Read: Padma Awards 2023 : గర్వంగా ఉంది పెద్దన్న.. కీరవాణిపై రాజమౌళి ట్వీట్
Aiyoooo.. don’t over think it babu.. 🤣❤️
— Rashmika Mandanna (@iamRashmika) April 6, 2023
దీంతో రష్మిక రూమర్లను కొట్టిపారేసిందా..? ఆ రూమర్లు నిజమే అని ఒప్పుకుందా..? అన్నది క్లారిటీగా తెలియడం లేదు. ఏది ఏమైనా విజయ్, రష్మిక రిలేషన్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పైగా రష్మిక మందాన్న బర్త్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ స్పందించినట్టుగా ఎక్కడా కనిపించడం లేదు. ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? అనే ఆసక్తి మాత్రం సోషల్ మీడియాలో జనాలకు ఎక్కువగానే ఉంది.
ప్రస్తుతం రష్మిక పుష్ప ది రూల్ సినిమాతో పాటుగా వెంకీ కుడుములతో మూడో సినిమా కూడా చేస్తోంది. భీష్మ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. నితిన్, రష్మిక, వెంకీ కలిసి ఓ కొత్త సినిమాను చేయబోతోన్న సంగతి తెలిసిందే.
Also Read: Samantha Ruth Prabhu : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అతడికి ఐలవ్యూ చెప్పిన సమంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Vijay Rashmika Dating: ఒకే ఇంట్లో ఒకే రూంలో రష్మిక విజయ్ ఉంటున్నారన్న మీడియా.. ఎక్కువగా ఆలోచించకన్న రష్మిక
నెట్టింట్లో రష్మిక బర్త్ డే సందడి
విజయ్‌తో డేటింగ్ మీద రూమర్లు
అంతగా ఆలోచించకండన్న రష్మిక