Rashmika School Girl: ఈరోజు నాకు పిచ్చెక్కిపోతుంది.. ఎలా కలవాలో అర్ధం కావడం లేదు: రష్మిక

Rashmika wants to meet School Girl who dance Saami Saami Song. స్కూల్లో 'సామి సామి' అంటూ డాన్స్‌ చేసిన చిన్నారిని కలవాలనుకుంటున్నా అని రష్మిక ట్వీట్ చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 15, 2022, 09:31 AM IST
  • ఈరోజు నాకు పిచ్చెక్కిపోతుంది
  • ఎలా కలవాలో అర్ధం కావడం లేదు
  • పాప అడ్రస్‌ కావాలంటూ రష్మిక ట్వీట్‌
Rashmika School Girl: ఈరోజు నాకు పిచ్చెక్కిపోతుంది.. ఎలా కలవాలో అర్ధం కావడం లేదు: రష్మిక

Rashmika Mandanna loves School Girl Dance to Saami Saami Song: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబోలో వచ్చిన 'పుష్ప: ది రైజ్' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2021 డిసెంబరు 17న విడుదలైన పుష్ప సినిమా.. కరోనా సమయంలో కూడా పాన్ ఇండియా లెవల్లో ఎవరూ ఊహించని కలెక్షన్లను రాబట్టింది. హిందీలో అయితే రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్, రష్మిక రేంజ్ మరో స్థాయికి చేరింది. రష్మిక అయితే పాన్ ఇండియా నటిగా మారిపోయారు. 

పుష్ప సినిమా అంతటి ఘన విజయం సాధించడానికి కారణం అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్ మాత్రమే కాదు. సినిమాలోని డైలాగ్స్‌, పాటలు కూడా బాగా హెల్ప్ అయ్యాయి. ఈ ఏడాది  పుష్ప చిత్రం పాటలు, డైలాగ్స్ సోషల్‌ మీడియాను షేక్ చేశాయి. ముఖ్యంగా 'తగ్గేదేలే' అనే డైలాగ్‌, 'సామి సామి' పాట యువతని కాకుండా ముసలాళ్లను కూడా ఆకట్టుకున్నాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా  రీల్స్‌ చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఈ పాటపై రీల్స్‌, డాన్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ చిన్నారి సామి సామి పాటకు అద్భుతంగా డాన్స్ చేసింది. 

స్కూల్లో ఓ చిన్నారి తన స్నేహితులతో కలిసి 'సామి సామి' అంటూ డాన్స్‌ చేసింది. ఈ పాటలో రష్మిక వేసిన హుక్‌ స్టెప్‌ను అచ్చు దించేసింది. మిగతా పిల్లలు మిస్ చేసినా.. తను మాత్రం స్టెప్స్ ఎక్కడా మిస్ కాలేదు. చిన్నారి డాన్స్‌కు ఫిదా అయిన ఓ నెటిజన్‌ 31 సెకండ్ల వీడియోని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు.  వైరల్‌గా మారిన ఈ వీడియో రష్మిక కంటపడింది. ఈ వీడియోను రష్మిక రీట్వీట్‌ చేసి.. ఈ చిన్నారి డాన్స్ చూసి నాకు పిచ్చెక్కిపోతుంది అని పేర్కున్నారు. 'మేడ్‌ మై డే. ఈ క్యూటీని కలవాలనుకుంటున్నా. ఎలా?' అని నేషనల్ క్రష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. 

Also Read: Gold Price Today 15 September: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధర!

Also Read: Horoscope Today 15 September 2022: ఆ రెండు రాశుల వారికి అధిక ధనవ్యయం తప్పదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News