Rashmika Mandanna : ఐదేళ్లలో ఐదు చోట్ల ఐదు బంగ్లాలు కొన్న రష్మిక.. అసలు విషయం ఏంటంటే?

Rashmika Mandanna Buys 5 Hosues రష్మిక మందాన్న మీద కొత్త రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఐదేళ్ల కెరీర్‌లో ఐదు చోట్ల లగ్జరీ భవనాలు కొనుగోలు చేసిందనే టాక్ ఎక్కువగా హల్చల్ చేస్తోంది. దానిపై హీరోయిన్‌ స్పందించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2023, 03:03 PM IST
  • ఐదేళ్లలో ఐదు బంగ్లాలు కొన్న హీరోయిన్
  • రష్మిక మీద కొత్త రూమర్ వైరల్
  • అసలు విషయం చెప్పిన రష్మిక మందాన్న
Rashmika Mandanna : ఐదేళ్లలో ఐదు చోట్ల ఐదు బంగ్లాలు కొన్న రష్మిక.. అసలు విషయం ఏంటంటే?

Rashmika Mandanna Buys 5 Hosues రష్మిక మందాన్న మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. మోస్ట్ ట్రోల్డ్ హీరోయిన్‌గానూ రష్మికే ముందుంటుంది. అయితే రష్మికకు సోషల్ మీడియాలో ఎంత పాజిటివిటీ ఉందో.. అంతే స్థాయిలోనెగెటివిటీ ఉంటుంది. ఇప్పుడు ఆమె మీద ఓ కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్లు అయిందని, ఈ ఐదేళ్లలో ఐదు చోట్ల విలాసవంతమైన భవనాలు కొనేసిందని రూమర్ వ్యాప్తి చెందుతోంది.

రష్మిక మందాన్న కన్నడ భామ అయినప్పటికీ తెలుగులో ఎక్కువగా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ ఆమె పేరు వినిపిస్తోంది. బాలీవుడ్‌లోనూ సందడి చేస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలను అక్కడ చేసింది. అమితాబ్‌తో గుడ్ బై, సిద్దార్థ్‌ మల్హోత్రతో మిషన్ మజ్ను చేసింది. కోలీవుడ్‌లో కార్తీ సుల్తాన్‌తో ఎంట్రీ ఇచ్చింది. దళపతి విజయ్ వారిసు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసింది.

అలా తెలుగులోనే రష్మికకు ఎక్కువ హిట్లున్నాయి. ఇక్కడే ఆమెకు స్టార్ స్టేటస్ వచ్చింది. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రతో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. ఇలా రష్మికకు వచ్చిన పాపులారిటీ వల్లే కొత్త కొత్త రూమర్లు వస్తుంటాయని ఆమె అభిమానులు అంటుంటారు.

రష్మిక మందాన్న మీద ఇప్పుడు అలాంటి ఓ రూమర్ వచ్చిందని అర్థం అవుతోంది. హైద్రాబాద్, బెంగళూరు, కూర్గ్, ముంబై, గోవా వంటి ప్రదేశాల్లో ఇళ్లు కొనేసిందని రష్మిక మీద రూమర్లు వచ్చాయి. అయితే దీనిపై రష్మిక స్పందించినట్టు తెలుస్తోంది.

అసలు ఇలాంటి రూమర్లు ఎలా వస్తాయో.. ఎవరు క్రియేట్ చేస్తారో తెలియడం లేదు.. ఇవన్నీ అవాస్తవాలే.. అయినా కూడా నిజమైతే బాగుండనిపిస్తోందంటూ రష్మిక చెప్పినట్టుగా తెలుస్తోంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ షూటింగ్‌ కోసం వెయిట్ చేస్తోంది.

Also Read:  Kalyan Ram Amigos Collections : అత్యంత దారుణంగా అమిగోస్ కలెక్షన్లు.. సుహాస్ కంటే తక్కువ?

Also Read: Shraddha Das Pics : ఆ పార్ట్‌ని మాత్రం క్లియర్‌గా చూపిస్తోన్న శ్రద్దా దాస్.. చూస్తే హీటెక్కాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News