Rashmika Mandanna: అది కావాలంటూ విజయ్ దేవరకొండకు రష్మిక చిలిపి రిక్వెస్ట్..

Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు ప్యాన్ ఇండియా లెవల్లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈమె చేసే చిన్న పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. తాజాగా ఈమె చేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 29, 2024, 02:01 PM IST
Rashmika Mandanna: అది కావాలంటూ విజయ్ దేవరకొండకు రష్మిక చిలిపి రిక్వెస్ట్..

Rashmika Mandanna: కథానాయిక రష్మిక మందన్నకు ప్యాన్ ఇండియా లెవల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్‌తో చేసిన 'పుష్ప' తర్వాత ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది. లాస్ట్ ఇయర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీతో పాపులర్ అయింది. ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే మ్యాటర్ ఉన్న సంగతి తెలిసిందే కదా. 'గీతా గోవిందం', డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించారు. అప్పటి నుంచి వీళ్లిద్దరు మధ్య స్నేహం మొదలైంది. ఇక రష్మిక మందన్న అప్పట్లో నాకు VD లాంటి మొగుడు కావాలంటూ చెప్పి సంచలనం రేపింది. అప్పటి నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య కెమిస్ట్రీ ఉందనే విషయం బటయపడింది.

తాజాగా రష్మిక మందన్న.. ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న నా డార్లింగ్స్ విజయ్ దేవరకొండ, పరశురామ్‌, మృణాల్‌ సహా 'ఫ్యామిలీ స్టార్' మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను రీచ్ అవుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 5 కోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. పార్టీ కావాలి అంటూ లవ్ సింబల్స్‌తో ట్వీట్ చేశారు. దీనికి విజయ్.. క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చారు.

గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.తొలిసారి విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించిరు. ఇప్పటికే విడుదల చేసిన మూడు పాటలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ.. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సుకుమార్‌తో ఓ సినిమా ఉంది. ఈ సినిమా రామ్ చరణ్ మూవీ తర్వాత పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి: Nita Ambani Visited Balkampet Temple: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ ప్రత్యేక పూజలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News