ఆర్.నారాయణమూర్తికి రామినేని పురస్కారం

అక్టోబరు 12వ తేదీన విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మక డా. రామినేని ఫౌండేషన్‌ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, గోవా సీఎం మనోహర్‌ పారికర్‌లు ముఖ్య అతిథులుగా హజరుకానున్న ఈ అవార్డుల ఫంక్షన్‌లో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.  అమెరికాకు చెందిన ప్రఖ్యాత డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ విశిష్ట పురస్కారాలను వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అందజేస్తారు. ఈ పురస్కారాన్ని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరితో పాటు ప్రొఫెసర్.గీతా కె. వేముగంటి,  సురభి కళాకారుడు ఆర్‌. నాగేశ్వరరావుతో పాటు నటుడు ఆర్‌. నారాయణమూర్తి కూడా అందుకోనున్నారు. సినీ రంగంలో చేసిన విశేష కృషికి గాను నారాయణమూర్తి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 

Last Updated : Oct 8, 2017, 06:09 PM IST
ఆర్.నారాయణమూర్తికి రామినేని పురస్కారం

విజయవాడ: అక్టోబరు 12వ తేదీన విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మక డా. రామినేని ఫౌండేషన్‌ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, గోవా సీఎం మనోహర్‌ పారికర్‌లు ముఖ్య అతిథులుగా హజరుకానున్న ఈ అవార్డుల ఫంక్షన్‌లో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.  అమెరికాకు చెందిన ప్రఖ్యాత డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ విశిష్ట పురస్కారాలను వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అందజేస్తారు. ఈ పురస్కారాన్ని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరితో పాటు ప్రొఫెసర్.గీతా కె. వేముగంటి,  సురభి కళాకారుడు ఆర్‌. నాగేశ్వరరావుతో పాటు నటుడు ఆర్‌. నారాయణమూర్తి కూడా అందుకోనున్నారు. సినీ రంగంలో చేసిన విశేష కృషికి గాను నారాయణమూర్తి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. 

Trending News