RGV Aasha Trailer: ఆశ మూవీపై ఆర్జీవీ ఏమంటున్నాడు

RGV Aasha Trailer: ఆర్జీవీ ల్యాబ్ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఎవరేం చెప్పినా..ఎన్ని విమర్శలు వచ్చినా అనుకున్నది చేయడమే రామ్‌గోపాల్ వర్మకు అలవాటు. ఇప్పుడు కొత్తగా విడుదలైన ఆశ ట్రైలర్ పై ఆర్జీవీ స్పందించాడు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 31, 2021, 02:48 PM IST
RGV Aasha Trailer: ఆశ మూవీపై ఆర్జీవీ ఏమంటున్నాడు

RGV Aasha Trailer: ఆర్జీవీ ల్యాబ్ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఎవరేం చెప్పినా..ఎన్ని విమర్శలు వచ్చినా అనుకున్నది చేయడమే రామ్‌గోపాల్ వర్మకు అలవాటు. ఇప్పుడు కొత్తగా విడుదలైన ఆశ ట్రైలర్ పై ఆర్జీవీ స్పందించాడు.

ఆర్జీవీ తాజా అప్ కమింగ్ సినిమా ఆశ ట్రైలర్(Aasha Encounter Trailer)ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దిశ అత్యాచార ఘటన ఆధారంగా ఆర్జీవీ ఈ సినిమాను తెరకెక్కించాడు. 2019 నవంబర్ 26న జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరేమనుకున్నా అనుకున్నది చేయడమే అలవాటుగా ఉన్న ఆర్జీవీ ..ఎన్ని విమర్శలు వచ్చినా వెనుకడుగేయకుండా సినిమా తీశాడు. గత వారమే పోస్టర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..తాజాగా ట్రైలర్ విడుదల చేశాడు. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు టైటిల్ మార్చి విడుదల చేశాడు. సినిమా నవంబర్ 26నే విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. దిశ ఆధారంగా తీసిన సినిమానే అయినా ఆర్జీవీ మాత్రం ఈ కథ ఎవరినీ ఉద్దేశించి తీసింది కాదంటున్నాడు రామ్‌గోపాల్ వర్మ(Ramgopal Varma). ఏ సంఘటనపై ఆధారపడి తీసింది కాదని..పూర్తిగా కల్పితమంటున్నాడు. ఆశ టైటిల్ రోల్‌లో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్న సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించారు.

Also read: Shyam Singha Roy: 'రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌' అంటున్న నాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News