Ramayana The Legend Of Prince: రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా యానిమేషన్ రూపంలో తెరకెక్కింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదలైంది. భారత దేశంలో రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకీ రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఇకపై వస్తాయి కూడా. ఎన్ని చిత్రాలు వచ్చినా.. ప్రేక్షకులు ఆదిరిస్తూనే ఉంటారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో, విజువల్స్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. యుద్ధం సన్నివేశాలు చూస్తే, ఆ రోజుల్లో అయోధ్య లో జరిగిన ఘట్టాలన్నీ మన కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఈ ట్రైలర్ లో చూపించిన అయోధ్య, మిథిలా నగరాలూ, పంచవటి అడవి ప్రాంతం, సీతారాములు అరణ్యవాసం చేసిన ప్రదేశాలు మొదలగునవి అన్నీ సహజంగా ఉన్నాయి. జపనీస్ యానిమే స్టైల్ లో ఈ ట్రైలర్ ని రూపొందించారు.
యుగో సాకో, కోయిచి ససకి మరియు రామ్ మోహన్ లు అందరూ కలిసి ఈ సినిమా ని భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దాదాపుగా 450 ఆర్టిస్ట్స్, ఒక లక్ష మంది హ్యాండ్ డ్రాన్ సేల్స్ ద్వారా ఈ విజువల్ మాస్టర్ పీస్ ని తెరకెక్కించారు. ఈ సినిమా భారత దేశం లోని గొప్ప కథ ని ట్రిబ్యూట్ లాగా భావిస్తున్నామని మోక్ష మోడిగిలి తెలిపారు.
Ramayana: The Legend of Prince Rama releasing theatrically in India on Jan 24, 2025, in Hindi, English, Tamil, and Telugu
New Hindi, Tamil and Telugu ver. are produced by Geek Pictures India pic.twitter.com/nfqHflN4mF
— Ramayana: The Legend of Prince Rama (Official) (@RamayanaAnime) January 8, 2025
ఈ సినిమా కి నిర్మాత గా పని చేసిన అర్జున్ అగర్వాల్, "ఇండియన్ హెరిటేజ్ ని గొప్ప గా సెలబ్రేట్ చేసుకొనే విధంగా ఈ రామాయణం సినిమా ని రూపొందించామన్నారు. కచ్చితంగా ఈ చిత్రం థియేటర్స్ లో అందరూ ఎంజాయ్ చేస్తారన్నారు.స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ ప్రాజెక్ట్ తో అసోసియేట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ, "ఈ రామయణం కథ ఎంతో మంది భారతీయుల్ని కదిలించిందన్నారు. కదిలిస్తూనే ఉన్నారు. కచ్చితంగా ఇంతకు మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమా ని చేసామన్నారు.
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.