Ramarao On Duty Movie: రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి 'బుల్ బుల్ తరంగ్' వచ్చేస్తోంది

Ramarao On Duty Movie Latest Updates: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం విడుదలకు సిద్ధమౌతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 10:48 PM IST
  • రామారావు ఆన్ డ్యూటీ మూవీ లేటెస్ట్ అప్‌డేట్స్
  • బుల్ బుల్ తరంగ్ సాంగ్ లాంచింగ్ డేట్ ప్రకటించిన చిత్ర యూనిట్
  • ఫారిన్ డ్యాన్సర్లతో స్పెయిన్‌లో లావిష్‌గా చిత్రీకరించిన సాంగ్
Ramarao On Duty Movie: రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి 'బుల్ బుల్ తరంగ్' వచ్చేస్తోంది

Ramarao On Duty Movie Latest Updates: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం విడుదలకు సిద్ధమౌతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సామ్ సిఎస్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుంచి మొదటి పాట 'బుల్ బుల్ తరంగ్'ని ఏప్రిల్ 10న చిత్ర బృందం విడుదల చేయనుంది. రవితేజ, రజిషా విజయన్‌పై చిత్రీకరించిన లవ్లీ సాంగ్ ఇది. ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంటుంది. ఫారిన్ డ్యాన్సర్లతో స్పెయిన్‌లో ఈ పాటని చాలా లావిష్‌గా చిత్రీకరించారు. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్లో రవితేజ, రజిషా జోడి బ్యూటిఫుల్ అండ్ స్టయిలీష్‌గా ఉంది.

ఇప్పటికే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ మూవీ పోస్టర్‌లు, టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఫుల్ ప్యాక్‌డ్ యాక్షన్‌తో నిండిన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలని పెంచాయి. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో దివ్యాంశ కౌశిక్‌ మరో హీరోయిన్‌‌గా కనిపించనుండగా.. కొంత గ్యాప్ తర్వాత సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

రామారావు ఆన్ డ్యూటీ మూవీ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌గా, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీ జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలు కాగా.. నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి (Surekha vani) తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Also read : RRR Records: ఆర్​ఆర్​ఆర్​ అరుదైన రికార్డు- బాలీవుడ్ సినిమాలకు పోటీగా కలెక్షన్లు

Also read : Bandla Ganesh on Pawan Kalyan: మీకు తిరుగులేదు దేవర... పవన్ కల్యాణ్‌పై బండ్ల గణేశ్ లేటెస్ట్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News