Skanda: ట్రోల్స్ కి గట్టిగా సమాధానం ఇచ్చిన రామ్.. మా డైరెక్టర్ నాకోసం చేశారంటూ వ్యాఖ్యలు

Ram Pothineni: చాక్లెట్ బాయ్ గా తన కెరియర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం మాస్ హీరోగా మారిన నటుడు రామ్. ఇక ఈ హీరో ఈమధ్య బోయపాటితో ఊర మాస్ చిత్రం స్కంద చేశారు. ఈ సినిమాకి మొదటి నుంచి మిక్సడ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలైన దగ్గర నుంచి మరిన్ని విమర్శలు వస్తున్నాయి. వాటికి గట్టిగా స్పందించాడు హీరో రామ్..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2023, 07:37 PM IST
Skanda: ట్రోల్స్ కి గట్టిగా సమాధానం ఇచ్చిన రామ్.. మా డైరెక్టర్ నాకోసం చేశారంటూ వ్యాఖ్యలు

Skanda: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం మాస్ సినిమాలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు బోయపాటి. ముఖ్యంగా ఆయన బాలకృష్ణతో ఒక సినిమా తీశారు అంతే అది బ్లాక్ బస్టర్ గా నిలవాల్సిందే. కానీ అలాంటి బోయపాటికి వేరే హీరోలతో తీసిన కొన్ని సినిమాలు డిజాస్టర్స్ గా కూడా మిగిలాయి. ముఖ్యంగా ఆయన కెరియర్ లో వినయ విధేయ రామ అప్పట్లో ఎన్నో ట్రోల్స్ ఫేస్ చేసింది.

ఇక ఆ సినిమా తర్వాత బోయపాటి కెరియర్ లో మళ్లీ అన్ని ట్రోల్స్ భారీన పడిన చిత్రం రామ్ స్కంద. రామ్ నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్స్ లో విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. కలెక్షన్ కూడా సుమారుగా వచ్చాయి.  శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా, శ్రీకాంత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కు సెకండ్ పార్ట్ కూడా ఉంది అని బోయపాటి క్లైమాక్స్ లో అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. 

కాగా ఈ సినిమాలో కథ కన్నా కూడా యాక్షన్ ఎక్కువ ఉంది అని  ఈ సినిమా విడుదలైనప్పుడు చాలామంది విమర్శలు చేశారు. ఇక ప్రస్తుతం స్కంద సినిమా నవంబర్ 2 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చింది.  అయితే ఓటీటీలో ఈ సినిమాని చూసిన వాళ్ళు సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లో ఒక షాట్ లో రామ్ కి బదులు డైరెక్టర్ బోయపాటి చేసినట్టు కనిపెట్టేశారు. 

అంతేకాదు ఆ సీన్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం పైనే కాకుండా మరికొన్ని విషయాల పైన కూడా ఈ సినిమాని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. కాగా వీటన్నిటి పైన ఫైనల్ గా రామ్ స్పందించారు

ఓ మీడియా సంస్థ బోయపాటి షాట్ ని పోస్ట్ చేయగా .. ఇక ఆ పోస్ట్ కి సమాధానం ఇచ్చేశారు హీరో రామ్.
'2023 సమ్మర్ ఏప్రిల్ 22న ఈ సీన్ షూటింగ్ జరిగింది. ఫుల్ సమ్మర్ లో జరిగిన షూట్ నాకింకా గుర్తు ఉంది. ఎండలో చెప్పులు లేకుండా ఫైట్ చేసే సీన్ అది. అప్పటికే మూడు రోజులు కష్టపడ్డాను. నేను కనీసం నడవలేక పోయాను. రక్తం రావడంతో కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాను. మా డైరెక్టర్ అంతలో ఆ షూట్ తానే నటించి పూర్తి చేశారు. ఒక సినిమా అనేది  నచ్చడం, నచ్చకపోవడం అనేది పూర్తిగా ఆడియన్స్ ఇష్టం. నేను మీ అభిప్రాయాలకు రెస్పెక్ట్ ఇస్తాను. ఇదంతా నేను మీ కోసమే చేస్తున్నాను. అలానే ఆ ఒక్క షాట్ మా డైరెక్టర్ నా కోసం చేశారు. నేను మాత్రం మిమ్మల్ని అలరించడానికి నా రక్తం, చెమటను ధారపోస్తాను' అని ట్వీట్ కు సమాధానమిస్తూ దాంతోపాటు తన అరికాలికి అయిన గాయాలు ఫోటోని షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Also Read: Mega Brothers Photo: ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ.. కూల్‌ లుక్‌లో మెగా బ్రదర్స్‌..!  

Also Read: Blaupunkt Soundbar: చీప్‌ ధరకే బెస్ట్‌ 100W సౌండ్‌ బార్‌..దీపావళి ప్రత్యేక సేల్‌పై అదనంగా 29 శాతం తగ్గింపు! 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News