Upasana: అందమైన చీరలో ఆకట్టుకున్న ఉపాసన.. అప్పటి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫోటోలు వైరల్

Golden Globe Awards: గత సంవత్సరం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి చక్కనైన చీరలో అటెండ్ అయింది ఉపాసన. ఆ ఫోటోలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2024, 06:50 PM IST
Upasana: అందమైన చీరలో ఆకట్టుకున్న ఉపాసన.. అప్పటి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫోటోలు వైరల్

Upasana At Golden Globe Awards: రామ్ చరణ్ భార్య గానే కాకుండా.. తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఉపాసన. ముఖ్యంగా ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసే ఫోటోలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. అందుకే ఈమెకు ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా అధికమే. ఈ ఫాలోవర్స్ ని రామ్ చరణ్ భార్యగా కాకుండా తనకంటూ ఉన్న సొంత ఇమేజ్ తో తెచ్చుకునింది ఉపాసన.

ఉపాసన ఫ్యాషన్స్ సెన్స్ కి అభిమానులు ఎందరో. ఆమె ఎక్కడికన్నా వెళితే చాలు ఆమె ఏ డ్రస్ వేసుకుంది అని ఎంతోమంది చూస్తూ ఉంటారు. అంతలా ఫ్యాషన్ ప్రపంచంలో పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఉపాసన గత సంవత్సరం గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో కట్టుకున్న చీర మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్ అవార్డులు దగ్గర పడుతూ ఉండటంతో…ఈ అవార్డులు ఎప్పుడు జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి అనే దానిపైన చర్చలు సోషల్ మీడియాలో అప్పుడే మొదలైపోయాయి. ఈ వేడుక కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లోని బెవర్లీ హిల్టన్‌లో జనవరి 7, 2024న సాయంత్రం 5 గంటలకు PT (జనవరి 8, 2024, IST ఉదయం 6:30 గంటలకు) జరగనుంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

 ఇలాంటి టైంలో గత సంవత్సరం గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్చుకుంటున్న ఫోటో మాత్రం ఉపాసనది అనే చెప్పాలి. గత సంవత్సరం ఎస్ ఎస్ రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ రెండు విభాగాల్లో నామినేషన్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రెండో విభాగంలో అవార్డు కూడా వచ్చింది. ఈ వేడుకకు రాజమౌళి .. కీరవాణి.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఇందులో చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

గత సంవత్సరం తన ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత  సంప్రదాయ చీరకట్టులో కనిపించి ఈ వేడుకలలో సందడి చేశారు. అలాంటి అవార్డుల ఫంక్షన్ కి సైతం చాలా సంప్రదాయపద్ధంగా ఉపాసన వెళ్లి చీరలో మెరవడం అప్పట్లో అందరిని మెప్పించింది. 

చాలా సింపుల్ సారీ.. రాణి పింక్ బ్లౌజ్.. అందమైన హెయిర్ స్టైల్ తో ఉపాసన అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు అలాంటి ఇంటర్నేషనల్ అవార్డు ఈవెంట్ కి మన పద్ధతికి ప్రతిరూపమైన చీరలో కనిపించి తనకు భారతీయ సాంప్రదాయాల మీద ఉన్న గౌరవాన్ని కూడా చాటి చెప్పింది. ఇక అప్పటి ఉపాసన అందమైన ఫోటోలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Also read: Japan Earthquake Scary Videos: జపాన్‌లో భారీ భూకంపం, భయపెడుతున్న వీడియోలు

Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్‌ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News