Ram Charan Plastic Surgery: అప్పుడు చరణ్ ను విమర్శించిన నోళ్లే ఇప్పుడు పొగుడుతున్నాయ్.. సర్జరీ ముందు తరువాత ఎలా ఉన్నాడో తెలుసా?

Truth Behind Ram Charan Plastic Surgery: జంజీర్ సినిమా తరువాత రామ్ చరణ్ ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు ప్రచారం జరిగింది, అయితే అసలు విషయం ఏమిటి? ఆయనను అప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు పొగుడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 27, 2023, 07:26 PM IST
Ram Charan Plastic Surgery: అప్పుడు చరణ్ ను విమర్శించిన నోళ్లే ఇప్పుడు పొగుడుతున్నాయ్.. సర్జరీ ముందు తరువాత ఎలా ఉన్నాడో తెలుసా?

Ram Charan Sinus Surgery News: గత కొద్దిరోజులుగా రామ్ చరణ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హాలీవుడ్ అంతా ప్రతిష్టాత్మకంగా భావించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాకి నాలుగు అవార్డులు వరించగా అందులో ఒక అవార్డుని రామ్ చరణ్ రాజమౌళితో కలిసి అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం మీద ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ మీద ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. వాస్తవానికి రామ్ చరణ్ నటనకు ఈ అవార్డు దక్కలేదు, సినిమాకు అవార్డు దక్కిన అవార్డు అందుకున్న తర్వాత రామ్ చరణ్ మాట్లాడిన మాటలకు అక్కడ అందరూ ఫిదా అయిపోయారు.

అయితే ఇప్పుడు రామ్ చరణ్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి కానీ ఒకప్పుడు అంటే ఆయన సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు ఆయన మీద విమర్శించిన వారు ఎక్కువగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత అనే సినిమాతో రామ్ చరణ్ తేజ లాంచ్ అయ్యాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నేహా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2007వ సంవత్సరంలో విడుదలైంది.. ఆ సమయంలో రామ్ చరణ్ ఇప్పుడున్న లాగా లేడు, అప్పట్లో ఆయన ముఖంలో చాలా మార్పులు ఉండేవి. అయితే కాలం గడిచిన కొద్దీ రామ్ చరణ్ ఒక్కొక్క సినిమాతో ఇట్లు కొడుతూ వచ్చారు. ఆఖరికి బాలీవుడ్ లో ఆయన జంజీర్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యారు.

ఆ జంజీర్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది, అలా భారీ డిజాస్టర్ గా నిలిచిన సమయంలో బాలీవుడ్ లోని కొందరు సలహాల మేరకు రామ్ చరణ్ తేజ ఫేస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. ముఖ్యంగా ముంబైలో ఆయనకు సైనస్ సర్జరీ జరిగింది. ఇప్పటికే అపోలో హాస్పిటల్ తన భార్యకు చెందిన ఉపాసనది అయినా ఆయన మాత్రం ముంబైలోని హిందూజా హాస్పిటల్ లో ఈ సైనస్ సర్జరీ చేయించుకున్నారు. ముంబైకి సెకండ్ ఒపీనియన్ తీసుకునేందుకు వచ్చిన రామ్ చరణ్ హిందూజా హాస్పిటల్ వైద్యుల మాటలతో కన్విన్స్ అయ్యి అక్కడే సర్జరీ చేయించుకున్నారని చెబుతూ ఉంటారు.

కేవలం సైనస్ సర్జరీ మాత్రమే కాదు రామ్ చరణ్ దవడలకు సంబంధించిన సర్జరీ కూడా చేయించుకున్నారని అప్పట్లో చెప్పేవారు. కొంతమేర ఇలాంటి సర్జరీల తర్వాత రామ్ చరణ్ మొహం పూర్తిగా మారిపోయింది, మొట్ట మొదటి సారిగా రామ్ చరణ్ ని రంగస్థలం సినిమా తర్వాత విమర్శకులు సైతం ప్రశంసించడం మొదలుపెట్టారు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో నటించిన రామ్ చరణ్ తేజ ఒక్కసారిగా తనలో ఉన్న నటుడిని బయటపెట్టినట్లు అయింది. సుకుమార్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా తెరకెక్కిన ఈ రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ వినయ విధేయ రామ అనే మరో సినిమా చేశారు. కానీ ఆ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

Also Read: Rashmika Mandanna Dress: డాషింగ్ హాట్ డ్రెస్సులో రష్మిక దర్శనం.. 'బెల్లంకొండ'కు హగ్గిస్తూ అందాల విందు!

Also Read: Jr NTR Fans Angry: చరణ్ కు పవన్ అభినందనలు.. ఇదేం న్యాయం అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News