RRR Movie: ఆర్ఆర్ఆర్ యూనిట్ వాడకం మాములుగా లేదుగా.. 'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' వద్ద మొదటి సినిమా మనదే!!

RRR is the first film to visit Statue of Unity for promotions. ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌తో పాటు దర్శకుడు రాజమౌళి గుజరాత్‌లోని 'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' దగ్గర సందడి చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2022, 04:51 PM IST
  • ఆర్ఆర్ఆర్ యూనిట్ వాడకం మాములుగా లేదుగా
  • 'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' సాక్షిగా ఎన్టీఆర్‌, చరణ్‌ దోస్తీ
  • మొదటి సినిమా మనదే
RRR Movie: ఆర్ఆర్ఆర్ యూనిట్ వాడకం మాములుగా లేదుగా.. 'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' వద్ద మొదటి సినిమా మనదే!!

RRR becomes First film to get promotions at Statue of Unity: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' మూవీ మేనియా నడుస్తోంది. దేశ వ్యాప్తంగా ఎవరిని కదిలించినా 'ఆర్ఆర్ఆర్' అని మాత్రమే వినిపిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో ఐదు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేది (మార్చి) దగ్గరపడుతుండడంతో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది. రోజుకో నగరం తిరుగుతూ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం దుబాయ్‌లో ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ పూర్తిచేసిన ఆర్ఆర్ఆర్ టీం.. శనివారం కర్ణాటకలో నిర్వహించింది. 

ఆర్ఆర్ఆర్ యూనిట్ ఆదివారం బరోడా (గుజరాత్‌), ఢిల్లీలో ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌తో పాటు దర్శకుడు రాజమౌళి కర్ణాటక నుంచి నేరుగా గుజరాత్‌కు వెళ్లారు. గుజరాత్‌లోని 'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' దగ్గర ఈ ముగ్గరు సందడి చేశారు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి అక్కడ ఫోటోలు దిగారు. ముఖ్యంగా తారక్‌, చెర్రీల దోస్థానం అందరిని ఆకట్టుకుంది. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోలు, దర్శకుడు మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి సినిమాను ప్రమోట్ చేశారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఇలా ప్రమోషన్స్ చేసుకున్న మొదటి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ కావడం విశేషం. ప్రమోషన్స్ నిమిత్తం ఏకంగా ఆర్ఆర్ఆర్ స్టిక్కర్లతో పలు కార్లను రోడ్ షో నిమిత్తం సిద్ధం చేయడం మరో విశేషం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను డివీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డివీవీ దాన‌య్య నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా సరణ్, ఓలియా మోరిస్ తదితరులు నటించారు.

 

Also Read: ENGW vs NZW: గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన హీథర్ నైట్.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే (వీడియో)!!

Also Read: IPL 2022: సీఎస్‌కేకు మరో షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News