Ram Charan Wishes to Allu Arjun : బన్నీకి ఇదే ఎక్కువ!.. అఖిల్‌తో చెర్రీ అనుబంధమిదే.. ఫ్యాన్స్ సెటైర్లు

Ram Charan Birthday Wishes to Allu Arjun రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా మెగా, అల్లు వారి మధ్య ఉన్న గ్యాప్ అందరికీ అర్థమైంది. రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా బన్నీ స్పందించలేదు. కనీసం ఒక్క ట్వీట్ కూడా అలా ఫార్మాలిటికి కూడా వేయలేదు

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2023, 07:02 PM IST
  • బన్నీపై రామ్ చరణ్ ట్వీట్ వైరల్
  • ఇదే ఎక్కువ అంటోన్న మెగా ఫ్యాన్స్
  • అఖిల్‌తో రామ్ చరణ్‌ బంధమిదే
Ram Charan Wishes to Allu Arjun : బన్నీకి ఇదే ఎక్కువ!.. అఖిల్‌తో చెర్రీ అనుబంధమిదే.. ఫ్యాన్స్ సెటైర్లు

Ram Charan Birthday Wishes to Allu Arjun మెగా అల్లు ఫ్యామిలీలు లోపల ఎలా ఉంటాయో గానీ.. సోషల్ మీడియాలో మాత్రం వారి కోల్డ్ వార్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంది. నెట్టింట్లో మెగా, బన్నీ ఫ్యాన్స్ ఎప్పుడూ వాగ్వాదానికి దిగుతూనే ఉంటారు. అల్లు అర్జున్ మెగా ట్యాగ్ నుంచి బయట పడాలని ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. సొంతంగా అల్లు బ్రాండ్‌ను ఏర్పర్చుకోవడానికి బన్నీ తెగ ఆరాట పడుతున్నాడు. అందుకే మెగా ట్యాగ్‌కు దూరంగా ఉంటున్నాడు.

ఇక మెగా, అల్లు వారి మధ్య ఉన్న గ్యాప్‌ అనేది రామ్ చరణ్‌ బర్త్ డే నాడు స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే రామ్ చరణ్‌ బర్త్ డేకు బన్నీ స్పందించలేదు. మొక్కుబడిగా కూడా ఓ ట్వీట్ గానీ పోస్ట్ గానీ వేయలేదు. కనీసం ఫోన్‌లో అయినా విష్ చేసి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ ఆ విషయంలోనూ క్లారిటీ రావడం లేదు. బన్నీ వ్యవహారం అలా ఉంటే.. రామ్ చరణ్‌ మాత్రం తన సంస్కారాన్ని కాపాడుకున్నాడు. 

 

అల్లు అర్జున్ తనకు విషెస్ చెప్పకపోయినా.. రామ్ చరణ్‌ మాత్రం విషెస్ చెప్పాడు. సింపుల్‌గా హ్యాపీయెస్ట్ బర్త్ డే అని అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేశాడు. ఇక దీంతో రామ్ చరణ్‌ మంచి మనసు గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. బన్నీ నీకు విషెస్ చెప్పకపోయినా కూడా నువ్ చెప్పావ్ చూడు.. గ్రేట్ అన్నా అని అంటున్నారు. ఇక బన్నీ ఫ్యాన్స్ అయితే.. ఏదైనా ఒక అన్ సీన్ పిక్ షేర్ చేయొచ్చు కదా? అని అడిగితే.. బన్నీకి ఇదే ఎక్కువ అని మెగా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.

Also Read:  "Where is Pushpa": బన్నీ బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. వేర్ ఈజ్ పుష్ప అంటూ అంచనాలు పెంచిన సుకుమార్

అయితే వెంటనే అఖిల్‌కు ప్రత్యేకంగా విషెస్ చెప్పాడు రామ్ చరణ్‌. హ్యాపీ బర్త్ డే టు మై డియరెస్ట్.. అఖిల్ అని.. ఓ అన్ సీన్ పిక్‌ను షేర్ చేశాడు. అదిరా రిలేషన్ అంటే.. అలా ఉండాలి.. బన్నీ నీ రేంజ్ ఇదే.. అఖిల్‌ రేంజ్ అది అంటూ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే బన్నీ కనీసం తనకు చెప్పిన విషెస్‌కు రిప్లై అయినా ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి.

 

Also Read: Pushpa The Rule New Poster : నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫర్ట్.. అమ్మోరు అవతారంలో అల్లు అర్జున్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News