Game Changer: గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏమిటి…ఇక విడుదల అప్పుడేనా!

Ram Charan: టాలీవుడ్ లో స్టార్ హీరోలు వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. లాస్ట్ ఇయర్ సినిమాలతో సందడి చేయని హీరోలు కూడా ఈ సంవత్సరం తమ సినిమాలతో సిద్ధమవుతున్నారు. అయితే రామ్ చరణ్ మూవీ మాత్రం ఎప్పటికీ విడుదలవుతుంది అన్న విషయం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏమిటో ఓ లుక్కేద్దాం పదండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 11:54 AM IST
Game Changer: గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏమిటి…ఇక విడుదల అప్పుడేనా!

Game Changer Release Date: రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి నెక్స్ట్ మూవీ కోసం వరల్డ్ వైడ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ అనే మూవీ పై గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది.. కానీ శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా పనుల్లో బిజీగా ఉండడం తో చెర్రీ మూవీకి బ్రేకులు పడుతూ వచ్చింది.

ఇంకా తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ కాకపోవడం పై మెగా ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని ఈ సంవత్సరం విడుదల చేయాలి అని చిత్రబృందం గట్టిగా ఫిక్స్ అయిందట. ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. కానీ ఫస్ట్ కాపీ ఎప్పుడు సిద్ధమవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ చిత్రం ఉంది. మొదట ఈ మూవీని వినాయక చవితికి విడుదల చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు దసరా కైనా విడుదల చేస్తే చాలు అన్నట్లు ఉంది పరిస్థితి.

అక్టోబర్ నెల మొదటి రెండు వారాలు కలెక్షన్స్ కి చాలా అనుకూలంగా ఉన్నాయి. 2 న  గాంధీ జయంతి, ఆ తర్వాత తెలంగాణలో బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి రెండు రోజులు వరుసగా సెలవులు. ఆ తర్వాత 4 నుంచి 6 వరకు లాంగ్ వీకెండ్ ఉంది. ఒక నాలుగు రోజుల తర్వాత 11వ తారీఖున దుర్గాష్టమి, 12 విజయదశమి. వెంటనే 13 ఆదివారం కలిసి వస్తుంది. అంటే సుమారు రెండు వారాల పాటు వరుసగా సెలవులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి.. ఈ టైం లో మూవీ విడుదలయితే మంచి కలెక్షన్స్ వసూల్ అయ్యే అవకాశం ఉంది.

పది రోజులకు పైగా బాక్స్ ఆఫీస్ పై ఏకధాటిగా పట్టు సాధించే అవకాశం దక్కుతుంది. ఇప్పటిదాకా ఈ డేట్ ను మిగిలిన ఏ పాన్ ఇండియన్ సినిమాలు రిజర్వ్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఈ టైంలో రామ్ చరణ్ మూవీ వస్తే అద్భుతంగా ఉంటుంది అని ఆశిస్తున్నారు. మరోపక్క భారతీయుడు 2 చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే టైం కి పుష్ప 2 విడుదల ఉంది. 

అయితే ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉంది అన్న టాక్ నడుస్తున్నప్పటికీ రిస్కు తీసుకునే ఉద్దేశం శంకర్ కి లేదు. భారతీయుడు 2 చిత్రం విడుదల అయ్యాకే తన పూర్తి ఫోకస్ ని గేమ్ ఛేంజర్ పై  పెట్టాలి అన్నది శంకర్ సంకల్పం. మరోపక్క దిల్ రాజ్ మాత్రం గేమ్ ఛేంజర్ కోసం నేను రెడీగా ఉన్నాను.. కాఫీ ఎప్పుడు ఇస్తారు మీరే శంకర్ ను అడిగి కనుక్కోండి అని అంటున్నారు. మొత్తానికి చెర్రీ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది పెద్ద బేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది.

Also Read: Lord Sri Ram Idol: అయోధ్య విగ్రహం.. రామయ్య నీరూపం చూడడానికి రెండు కళ్లు చాలవయ్యా

Also Read: Ram Mandir: అయోధ్యకు ప్రభాస్ 50 కోట్ల విరాళం…క్లారిటీ ఇచ్చిన టీమ్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News