Rakul Preet Singh: రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్.. ఆ రిస్కీ పాత్రకి సిద్ధమైపోయిన హీరోయిన్

Ramayanam:రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు తన బ్యూటీతో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మకు గత కొద్ది కాలంగా సరియైన ఆఫర్లు లేవు. ఇతర భాషల్లో అడపాదడపా ఆఫర్లు వస్తున్నాయే తప్ప చెప్పుకోదక్క సినిమాలైతే లేవు. ప్రస్తుతం హిందీలో తీస్తున్న రామాయణంలో రకుల్ ఓ రిస్కీ పాత్ర చేయబోతున్నట్లు టాక్. ఇంతకీ ఆ పాత్ర ఏమిటో? అందులో ఉన్న రిస్క్ ఏమిటో? తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2024, 05:22 PM IST
Rakul Preet Singh: రామాయణంలో రకుల్ ప్రీత్ సింగ్.. ఆ రిస్కీ పాత్రకి సిద్ధమైపోయిన హీరోయిన్

Rakul Preet Singh: టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్రేంజ్ హీరోల వరకు.. ఎందరితోను సినిమాలు చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. వెంకటాద్రి ఎక్స్ప్రెస్.. కరెంట్ తీగ లాంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ నాన్నకు ప్రేమతో, కిక్ 2 లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. కెరీర్లో కొత్తదనం కోసం మెల్లిగా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన రకుల్..బాలీవుడ్  స్టార్ హీరోలతో సినిమాలు చేసింది కానీ అనుకున్నంత స్టార్డం మాత్రం అందుకోలేకపోయింది.

2021 లో వచ్చిన కొండ పొలం సినిమా తరువాత తిరిగి రకుల్ మరే తెలుగు సినిమా చేయలేదు. రీసెంట్ గా విడుదలైన తమిళ్ డబ్బింగ్ మూవీ అయలాన్ తో ప్రేక్షకులను పలకరించింది. తమిళ్ లో మంచి టాక్ అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 లో రకుల్ నటిస్తోంది. ఈ మూవీ తర్వాత రకుల్ చాలా రిస్కీ రోల్ చేయబోతోంది అని తెలుస్తోంది.

భారతీయుడు తర్వాత మరో పెద్ద ప్రాజెక్టు లేదు అనుకునే టైంలో రకుల్ కి ఓ భారీ ప్రాజెక్టు నుంచి ..ఓ రిస్కీ పాత్ర కోసం ఆఫర్ వచ్చిందట. భారతీయులు అందరూ ఎంతో గర్వంగా ఫీల్ అయ్యే విధంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు నితీష్ తివారి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఆ సినిమా మరేదో కాదండి.. సంపూర్ణ రామాయణం. ఈ మూవీ ఫ్రాంచైజ్ ద్వారా మొత్తం రామాయణాన్ని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో భారీ తారాగణం ఉండబోతున్నట్లు టాక్.

రాముడి కథ అంటే.. రాముడుతోపాటు గుర్తుకు వచ్చే మరొక క్యారెక్టర్ రావణాసురుడు. మరి రావణాసురుడు చెల్లి శూర్ఫణఖ రామాయణానికే సూత్రధారి.. అలాంటి పాత్రకు సినిమా లో స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది. పైగా ఇది నెగటివ్ రోల్. అయితే ఇంతకుముందు వచ్చిన రామాయణం సినిమాలతో పోల్చుకుంటే ఈ మూవీలో శూర్ఫణఖ పాత్ర ను ప్రత్యేక దృష్టితో తీర్చిదిద్దుతున్నాడు డైరెక్టర్. ఈ పాత్ర కోసం రకుల్ ని అనుకుంటున్నట్లు టాక్.మరోపక్క ఈ సినిమాలో అతి ముఖ్యమైన సీత పాత్ర కోసం కూడా మంచి హీరోయిన్ అన్వేషణ జరుగుతోంది.ఈ పాత్రల కోసం సాయి పల్లవి తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ రెండు పాత్రలలో రకుల్ ప్రీత్ సింగ్ ఎందులో నటిస్తుందో  చూడాలి.

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News