రజనీకాంత్ నటిస్తున్న 2.0 సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ వేడుకకు రంగం సిద్ధమవుతోంది. అయితే కొంత వైవిధ్యంగా ఈ వేడుకను చేయాలని భావించారు నిర్మాతలు. మరి ఆ ప్రత్యేకతలేమిటో మనం కూడా తెలుసుకుందామా..
- ఈ ఆడియో ఫంక్షన్ అక్టోబరు 27, 2017 తేదీన దుబాయ్‌లో అట్టహాసంగా జరగబోతోంది
- ఈ వేడుకలో సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ స్వయంగా లైవ్ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. ఆయనే స్వయంగా పాటలను పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు
- ఆ ఆడియో ఫంక్షన్‌కు సంబంధించిన పోస్టరును ఇటీవలే ట్విటర్ ద్వారా విడుదల చేశారు ఏ.ఆర్.రెహమాన్. ఆ పోస్టరులో కనిపిస్తున్న కీబోర్డును వాయిస్తున్న చేతిలో ఒకటి ఓ మోనస్టర్ చేయి కాగా, మరొకటి రోబోట్ చేయి కావడం విశేషం
- దుబాయ్‌లో అతిగొప్ప విలాసవంతమైన ప్రదేశమైన డౌన్ టౌనులోని బుర్జ్ పార్క్‌లో 2.0 ఆడియో రిలీజ్ వేడుకలు జరగనున్నాయి
- ఈ ఒక్క ఆడియో ఫంక్షన్ జరపటానికి నిర్మాతలు దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అంచనా
- పలువురు హాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఆడియో ఫంక్షనుకు వస్తున్నారని వినికిడి
— A.R.Rahman (@arrahman) October 23, 2017
- ఈ సినిమాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ అధినేతలు మాట్లాడుతూ, బహుశా ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆడియో ఫంక్షన్ మరియు మ్యూజికల్ ప్రోగ్రామ్‌గా ఈ ఫంక్షన్‌ను భావించవచ్చని తెలిపారు
- ఇక ఈ ఆడియో ఫంక్షన్లో భాగంగా ఏ.ఆర్.రెహమాన్ నిర్వహిస్తున్న మ్యూజికల్ నైట్‌లో పాలుపంచుకోవాలనుకొనే అభిమానుల కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కూడా విక్రయిస్తున్నారు. విఐపీ విభాగంలోఒక్కో టికెట్ ధర 20,800 దినార్లు పలుకుతోంది. ఈ టికెట్ కొనే ప్రేక్షకుడికి ఒక టేబుల్ ప్యాకేజీ ఇస్తారు. ఆ ప్యాకేజీలో 1 బాటిల్ హార్డ్ డ్రింక్, 3 రెడ్ బుల్స్, 3 క్యాన్ల 7 లప్ బాటిల్స్, 1 క్రాన్‌బరీ జ్యూస్ బాటిల్, 1 ఆరెంజ్ జ్యూస్ బాటిల్, తినడానికి ఒక అమౌజ్ బచ్ ప్లేటర్ కూడా కాంప్లిమెంటరీగా లభిస్తుందట.
- అలాగే టికెట్ కొనే ప్రతి ప్రేక్షకుడికీ విఐపీ ట్రీట్‌మెంట్ కూడా ఉంటుంది