Rajinikanth Remuneration: నిమిషానికి కోటి... ఆశ్చర్యపరుస్తున్న రజనీకాంత్ రెమ్యూనరేషన్

Rajinikanth:జైలర్ మూవీతో రికార్డులు బద్దలు కొట్టిన రజినీ ..ఇప్పుడు తన రెమ్యూనరేషన్ విషయంతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఓ చిన్న గెస్ట్ రోల్ చేసినందుకు లాల్ సలాం మూవీకి రజనీ తీసుకున్న రెమ్యూనరేషన్ అందరి మైండ్స్ బ్లాక్ చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2024, 11:30 AM IST
Rajinikanth Remuneration: నిమిషానికి కోటి... ఆశ్చర్యపరుస్తున్న రజనీకాంత్ రెమ్యూనరేషన్

Rajini Remuneration:సూపర్ స్టార్ రజనీకాంత్.. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ స్టార్ జైలర్ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ స్పీడ్ కంటిన్యూ చేస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రజినీ గెస్ట్ రోల్ ప్లే చేసిన లాల్ సలాం చిత్రం రీసెంట్ గా విడుదల అయింది. ఈ మూవీలో రజినీ రెమ్యూనరేషన్ కి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ అసలు సంగతేమిటో తెలుసుకుందాం..

జైలర్ మూవీతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాడు రజనీకాంత్. 73 సంవత్సరాల వయసు ఉన్న రజనీ.. ఇప్పటికి కూడా కుర్ర హీరోలకు కాంపిటీషన్ వచ్చే రేంజ్ లో సినిమాలు తీస్తున్నారు. ఇక రీసెంట్గా రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో వచ్చిన మూవీ లాల్ సలాం. ఇందులో రజినీ గెస్ట్ రోల్ ప్లే చేశారు. అయితే ప్రస్తుతం ఈ రోల్ కోసం ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

క్రికెట్ ,పాలిటిక్స్ బ్యాక్ గ్రౌండ్ లో సాగే ఈ మూవీలో రజనీ పోషించిన పాత్ర పేరు మోయనుద్దీన్ భాయ్. ఆ పాత్రలో రజనీ గెటప్ అందరిని ఆకర్షించింది. తన కూతురు డైరెక్ట్ చేస్తున్న సినిమా అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో రజనీ అసలు రాజీ పడలేదట. ఈ మూవీలో రజని ఒక ముస్లిం వర్గానికి పెద్దగా, పారిశ్రామికవేత్తగా కనిపిస్తారు. అంతేకాదు ఉరి మీద విపరీతమైన అభిమానం ఉన్న వ్యక్తిగా.. ఒక క్రికెట్ ఫ్యాన్ గా రజని ఈ చిత్రంలో కనిపించి మెప్పించారు. తన పాత్ర పరంగా రజనీ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవితా రాజశేఖర్ ముఖ్య పాత్రను పోషించారు. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ ప్లే చేశారు.

కాగా ఈ మూవీలో రజనీకాంత్ పాత్ర కేవలం సినిమాలో 30 నుంచి 40 నిమిషాల వరకు సాగుతుంది. కీలకమైనది అయినప్పటికీ.. పరిమితమైన నిడివి తో కూడుకున్న ఈ పాత్ర కోసం రజనీకాంత్ తీసుకున్న పారితోషకం అక్షరాల 40 కోట్లు అని టాక్. అంటే నిమిషానికి కోటి రూపాయలు చొప్పున పుచ్చుకున్నారు. 

రజనీకాంత్ జైలర్ పాత్ర పోషించిన జైలర్ మూవీ ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. దీంతో అతను చేయబోయే నెక్స్ట్ మూవీస్ పై విపరీతంగా అంచనాలు పెరిగాయి.. వాటితో పాటుగా రజినీ రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. అయితే ఒక గెస్ట్ రోల్ కోసం నిమిషానికి కోటి చొప్పున పుచ్చుకున్న రజనీ తన నెక్స్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఏ లెవెల్ లో తీసుకుంటాడో అన్న విషయంపై కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి.

Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం

Also ReadSamudrika Shastra: చేతిగోళ్లపై ఈ గుర్తు ఉందా? జీవితాంతం సంపదకు లోటే ఉండదట..!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News