rajinikanth: రజినీకాంత్ సాహస యాత్ర

రజినీకాంత్ సాహస యాత్రకు ఇక  రెండు రోజులే మిగిలి ఉంది. మొట్టమొదటిసారిగా సూపర్ స్టార్  రజినీకాంత్ టెలివిజన్ తెరపై కనిపించనున్నారు.  అంతే కాదు ఈసారి తన సాహస యాత్రతో అభిమానులు, ప్రేక్షకులను అలరించనున్నారు.

Last Updated : Mar 21, 2020, 12:58 PM IST
rajinikanth: రజినీకాంత్ సాహస యాత్ర

రజినీకాంత్ సాహస యాత్రకు ఇక  రెండు రోజులే మిగిలి ఉంది. మొట్టమొదటిసారిగా సూపర్ స్టార్  రజినీకాంత్ టెలివిజన్ తెరపై కనిపించనున్నారు.  అంతే కాదు ఈసారి తన సాహస యాత్రతో అభిమానులు, ప్రేక్షకులను అలరించనున్నారు. 

సూపర్ స్టార్ రజినీకాంత్ టెలివిజన్ తెరపై కనిపించనున్న ప్రోగ్రామ్ Into The Wild. బేయర్ గ్రిల్స్ తో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమం డిస్కవరీ చానెల్ లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని మార్చి 23న రాత్రి 8 గంటలకు ప్రసారం  చేయనున్నారు. ఈ  కార్యక్రమంలో బేయర్ గ్రిల్స్, రజినీకాంత్ పలు అంశాలపై మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది.  వారిద్దరి సంభాషణకు సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ముగ్ధులవుతున్నారు. టెలివిజన్ తెరపై తొలిసారి  కనిపించిన సూపర్ స్టార్  ప్రోమో ఆకట్టుకుంటోంది.

మీరు ఏమీ అనుకోకపోతే.. మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా ..? అని బేయర్  గ్రిల్స్ అడిగిన  ప్రశ్నకు తలైవా ఏం  తడుముకోకుండా 70 ఏళ్లు అని సమాధానమిచ్చారు. ఈ వయసులోనూ మీరు ఎంతో ఫిట్ గా ఉన్నారని బేయర్ గ్రిల్స్ కితాబిచ్చారు. యుక్త వయసులో ఏం చేశేవారని గ్రిల్స్ అడగగా.. బస్ కండక్టర్ గా ఉండేవాణ్నని రజినీకాంత్ సమాధానమిచ్చారు.   

Read Also: మందుబాబుల క్రమశిక్షణ

70 ఏళ్ల వయసులోనూ సూపర్ స్టార్ .. యువకుడిగా బేయర్  గ్రిల్స్ తో కలిసి సాహసాలు  చేయడం ఆకట్టుకుంటుంది.  తాను ఎప్పుడూ ఇలాంటి సాహసాలు చేయలేదని రజినీకాంత్ చెప్పారు. తనతో ఇలాంటి  సాహసాలు చేయించినందుకు థ్యాంక్స్ అంటూ గ్రిల్స్ ను అభినందించారు. 

ప్రోమో చివరలో సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ గా అద్దాలు పెట్టుకోవడం ఆకట్టుకుంటుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News