Rajinikanth Dada Saheb Phalke: ఆనందంలో సూపర్​స్టార్ రజనీకాంత్​.. ఒకే రోజు రెండు విశేషాలు..

Rajinikanth Dada Saheb Phalke: ప్రతిష్టాత్మక దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డు తనను వరించడం పట్ల తమిళ సూపర్​ స్టార్​ రజనీకాంత్​ (Rajinikanth News) మరోసారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. సోమవారం (అక్టోబరు 25) ఆ అవార్డును అందుకోనున్న క్రమంలో ట్విట్టర్​లో తన సంతోషాన్ని పంచుకున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2021, 02:35 PM IST
    • ఆనందంలో తమిళ సూపర్​స్టార్​ రజనీకాంత్​
    • తన జీవితంలో ఒకేరోజు రెండు విశేషాలు జరగనున్నాయని ప్రకటన
    • దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డు వరించడం పట్ల హర్షం
Rajinikanth Dada Saheb Phalke: ఆనందంలో సూపర్​స్టార్ రజనీకాంత్​.. ఒకే రోజు రెండు విశేషాలు..

Rajinikanth Dada Saheb Phalke: చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు తనకు దక్కడం పట్ల సూపర్​ స్టార్​ రజనీకాంత్​ (Rajinikanth News) మరోసారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డును సోమవారం దిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో రజనీ అందుకోనున్నారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ రజనీకాంత్​ ఆదివారం ఓ ట్వీట్​ చేశారు. ఒకే రోజున రెండు ఆనందించదగ్గ విశేషాలు జరగనున్నాయని అందులో పేర్కొన్నారు.  

"రేపు నా జీవితంలో రెండు ముఖ్యమైన సంఘటనలు జరగనున్నాయి. అందులో మొదటిది.. సోమవారం దిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డును నేను అందుకోనున్నాను. ఈ సందర్భంగా నాపై అభిమానులు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. రెండోవది.. నా కుమార్తె సౌందర్య విఘ్నేశ్‌ ఎంతో శ్రమించి సిద్ధం చేసిన 'హూట్‌ యాప్‌'ను (Hoote App) రేపు నేను లాంచ్​ చేయనున్నాను. సౌందర్య తన ప్రయత్నాలతో రూపొందించిన ఈ యాప్​ ఎంతో మందికి​ ఉపయోగ పడనుంది. ఏ భాషాలోనైనా ప్రజలు తమ ఆలోచనలు, కోరికలను వాయిస్​ ద్వారా వెల్లడించవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన యాప్​ను లాంచ్​ చేసేందుకు నేనెంతో ఆసక్తిగా ఉన్నాను" అని రజనీకాంత్​ ట్వీట్​ చేశారు. 

మరోవైపు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును తమిళ సూపర్​ స్టార్​ రజనీకాంత్‌కు ఇవ్వనున్నట్లు ఏప్రిల్‌ నెలలోనే కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కరోనా కారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడుతూ వచ్చింది.

'పెద్దన్న' టీజర్​..  

రజనీకాంత్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న తమిళ చిత్రం 'అన్నాత్తే' మూవీ తెలుగులో 'పెద్దన్న' అనే పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4 నుంచి ఈ మూవీ థియేటర్లలో (Peddanna Movie Release Date) సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో 'పెద్దన్న' టీజర్​ను (Peddanna Teaser) శనివారం (అక్టోబరు 23) విడుదల చేశారు. టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ చేతుల మీదుగా ఈ టీజర్​ రిలీజ్​ అయ్యింది. 

Also Read: రజనీకాంత్‌ ‘పెద్దన్న’ టీజర్‌‌ అదిరింది.. ఫ్యాన్స్‌కు వెంకటేశ్‌ సర్‌ప్రైజ్‌

Also Read: 'ఎఫ్​ 3' సినిమా రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News