Rajamouli: సెన్సేషనల్ పాటకి భార్యతో స్టెప్పులు వేసిన రాజమౌళి.. వైరల్ అవుతున్న వీడియో

Rama Rajamouli: రాజమౌళి అంటే ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఈ దర్శకుడు ఏమి చేసినా అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలో ఈ డైరెక్టర్ తన భార్యతో వేసిన స్టెప్పుల వీడియో సోషల్ మీడియాలో అందరిని అలరిస్తోంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 11, 2024, 02:03 PM IST
Rajamouli: సెన్సేషనల్ పాటకి భార్యతో స్టెప్పులు వేసిన రాజమౌళి.. వైరల్ అవుతున్న వీడియో

Rajamouli Dance Video: తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. అంతకుముందు కూడా ఎన్నో తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న.. రాజమౌళి బాహుబలి సినిమాతో టాలీవుడ్ మరింత పెద్ద స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ దర్శకుడికి వివిధ దేశాలలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఆస్కార్ అవార్డు సైతం అందుకొని ఆయన్ని మరింత ఫేమస్ చేసింది. దీంతో ఇప్పుడు రాజమౌళి ప్రతి అడుగు ప్రపంచం మొత్తం అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉంది. ఈ క్రమంలో రాజమౌళి తన భార్యతో వేసిన డాన్స్ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు రాజమౌళి మనకు అద్భుతమైన దర్శకునిగానే తెలుసు.. కానీ ఇటీవ‌ల త‌న‌లోని డ్యాన్సింగ్ క‌ళ‌ను బ‌య‌టకు తీసుకువ‌చ్చారు. ఈ మధ్యనే స్టేజ్ పైన తన భార్య రమా రాజమౌళితో ఒక పాటకి డాన్స్ వేస్తూ అలరిచ్చారు ఈ డైరెక్టర్. ఆ వీడియో మరిచిపోక ముందే ఇప్పుడు మళ్లీ ఇంకో రాజమౌళి వీడియో వైరల్ అవుతుంది. సెన్సేషనల్ పాట ‘అంద‌మైన ప్రేమ‌రాణి చెయ్యి త‌గిలితే’ కు రాజమౌళి అతని భార్య రమా రాజమౌళితో స్టెప్పులు వేశారు. రాజమౌళి తన భార్యతో కలిసి ఎంతో ఆక్టివ్ గా స్టెప్ వేసిన ఈ పాట వీడియో కాస్త ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.

 

ఇదిలా ఉంటే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా త‌రువాత ప్రస్తుతం దర్శకుడు రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబుతో క‌లిసి ఓ సినిమాను చేస్తున్నారు. SSMB29 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ప్రకారం ఈ సినిమా ఇండియానా జోన్స్, రాబిన్ హుడ్ రేంజ్ అడ్వెంచర్ స్టైల్లో ఉండబోతుందట. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం రెండు పార్టులు రానుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు.

Also Read: KCR Ugadi Panchangam: కేసీఆర్‌కు మళ్లీ గెలుపు అవకాశాలు.. కేటీఆర్‌కు కొంత కష్టమే.. ఉగాది పంచాంగం ఇలా..

Also Read: Lok Sabha Polls: ఎంపీ ఎన్నికలకు రేవంత్‌ రెడ్డి భారీ వ్యూహం.. అలా నామినేషన్‌.. ఇలా ప్రచారం

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News