నానీ.. నీ సినిమా అద్భుతం: రాజమౌళి

యువ నటుడు నాని నిర్మాతగా మారి నిర్మిస్తున్న తొలి చిత్రం "అ" పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Last Updated : Jan 5, 2018, 04:42 PM IST
నానీ.. నీ సినిమా అద్భుతం: రాజమౌళి

 ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. ‘మీకొక కథ చెప్తా. అనగనగా ఓ రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురూ నాలాంటి ఏడు ఇనోసెంట్ చేపల్ని పట్టుకున్నారు' అని నాని చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది.

ఈ చిత్రంలో చేప పాత్రకు నాని, చెట్టు పాత్రకి రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ చిత్రం టీజర్ చాలా బాగుందని ఇటీవలే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ట్విటర్ ద్వారా స్పందించారు.  ‘అ’ద్భుతం..’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకోవడంతో పాటు..సినిమా టీజర్‌ను కూడా షేర్ చేశారు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో నాని నిర్మిస్తున్న 'అ' చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. 

 

Trending News