Raja Ravindra Anchor Syamala : శ్యామల ఆంటీ అంటూ కౌంటర్లు.. స్టేజ్ మీద యాంకర్‌పై రాజా రవీంద్ర సెటైర్లు

Raja Ravindra Funny Comments on Anchor Syamala రాజా రవీంద్ర తాజాగా తగ్గేదేలే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా యాంకర్ శ్యామల మీద కౌంటర్లు వేశాడు. ఆంటీ అంటూ కామెంట్ చేయగా.. శ్యామల సెటైర్లు వేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2022, 03:23 PM IST
  • నవీన్ చంద్ర కొత్త సినిమా
  • తగ్గేదేలే సినిమా ఈవెంట్
  • శ్యామల మీద రాజా రవీంద్ర కౌంటర్లు
Raja Ravindra Anchor Syamala : శ్యామల ఆంటీ అంటూ కౌంటర్లు.. స్టేజ్ మీద యాంకర్‌పై రాజా రవీంద్ర సెటైర్లు

Raja Ravindra Anchor Syamala : రాజా రవీంద్ర నటుడిగా, కుర్ర హీరోలకు మేనేజర్‌గా, చిన్న చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉంటూ బాగానే సంపాదించేసుకుంటున్నాడు. ఇక ఈ మధ్య రాజా రవీంద్ర పలు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. ఇక తాజాగా ఆయన నటించిన తగ్గేదేలే సినిమా ఈవెంట్ జరిగింది. ఇందులో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు. దండు పాళ్యం సినిమాను తీసిన శ్రీనివాస్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఈ చిత్రం నవంబర్ 4న విడుదలవుతోంది. ఈక్రమంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజా రవీంద్ర తన స్పీచ్ చివర్లో కౌంటర్లు వేశాడు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజా రవీంద్ర మాట్లాడుతూ మా యంగ్ నిర్మాతలు ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డి మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీలోకి వచ్చారు.. బాహుబలి లాంటి పది సినిమాలు తీసేంత ఉన్నా కూడా మంచి కంటెంట్ బేస్డ్ చిత్రాలు తీయాలని అనుకుంటున్నారు.. అందుకే ఈ తగ్గేదేలే సినిమాను తీశారు. కరోనాలో ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. భద్ర ప్రొడక్షన్ కంపెనీ, నిర్మాతలు మా అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు.. అందరికీ ముందే పేమెంట్స్ ఇచ్చారు.. వ్యాక్సినేషన్ చేయించారు.. సొంత మనుషుల్లా చూసుకున్నారు..

ఈ సినిమాకు అందరూ ఎంతో సంతోషంగా పని చేశారు.. ఇలాంటి చిత్రాలు ఆడితే.. ఈ బ్యానర్ ద్వారా అందరికీ పని దొరుకుతుంది.. అంటూ ఇలా తన ప్రసంగాన్ని ఇచ్చుకుంటూ వెళ్లాడు. చివర్లో శ్యామల ఆంటీకి థాంక్స్ అంటూ చురకలు అంటించాడు రాజా రవీంద్ర. అయితే వెంటనే శ్యామల కూడా తిరిగి కౌంటర్లు వేసింది.

నేను ఆంటీని అంటే.. మీరు మాత్రం తాత అవుతారు అంటూ వెంటనే కౌంటర్లు వేయడంతో అందరూ నవ్వేశారు. ఇక స్టేజ్ మీద ఈ ఇద్దరూ సంభాషణ అందరినీ నవ్వించేసింది. ఇలా యాంకర్ల మీద ఈ మధ్య సెలెబ్రిటీలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. గతంలో ఓసారి యాంకర్ శ్యామల మీద ఆర్జీవీ కన్నేశాడు. బాగున్నావ్ అంటూ అందరి ముందు స్టేజ్ మీదనే పొగిడేశాడు. దీంతో శ్యామల తెగ సిగ్గుపడిపోయింది. అయితే రాజా రవీంద్రకు శ్యామల ఇన్‌స్టంట్‌గా వేసిన ఈ కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Also Read : Anasuya Bharadwaj Pics : ఎండిపోయిన ఆకులతో అనసూయ సోకులు.. న్యూజెర్సీలో యాంకర్ సందడి

Also Read : Pathaan telugu Teaser : పవర్‌ఫుల్ యాక్షన్ మూవీగా పఠాన్.. అదరగొట్టేసిన షారుఖ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News