Raghu Kunche Emotional Note: తెలుగు సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె తండ్రి లక్ష్మీనారాయణ రావు మంగళవారం నాడు కన్ను మూసిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన కుంచె లక్ష్మీనారాయణ రావు 1933లో జన్మించగా ఆయనకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు, కాకుండా మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. లక్ష్మీనారాయణరావు అంత్యక్రియలను కూడా బుధవారం స్వగ్రామంలో నిర్వహించారు.
వృత్తి రీత్యా రైతు అయిన లక్ష్మీనారాయణరావు స్థానిక సాగునీటి సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించడమే కాక హోమియో వైద్యుడిగా సేవలందించారు. ఇక నటుడిగా, ప్లే బ్యాక్ సింగర్ గా రఘు కుంచె పరిశ్రమలో అందరికీ సుపరిచితమే. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన బాచి మూవీలో ఆయన ముందుగా కనిపించడమే కాదు ఆ సినిమాలో ఒక సాంగ్ పాడారు.
పూరి జగన్నాధ్ ఆయనకు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఆఫర్ ఇవ్వడంతో 2009లో విడుదలైన బంపర్ ఆఫర్ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా లాంచ్ అయ్యారు. ఇక తన తండ్రి మరణం నేపథ్యంలో రఘు కుంచె ఎమోషనల్ అయ్యారు. కాలం చేయడానికి కొన్ని గంటలు ముందు .. నేను తెచ్చిన కొత్త బట్టలు వేసుకుని, ఫ్యామిలీ తో ఉల్లాసంగా గడిపి, దూరంగా ఉన్నవాళ్ళతో video call లో పలకరించి, మర్నాడు (17th ) పొద్దున్నే లేచి స్నానం చేసి, పూజ చేసుకుని, ఉదయం అల్పాహారం చేసి తన కిష్టమైన మడత కుర్చీలో వెనక్కి వాలి, తన ప్రాణానికి ప్రాణమైన భగవద్గీత చదువుతూ అలానే శాశ్వత నిద్రలోకి జారిపోయారు. ఏ రోజు ఎవరిని కించిత్ కూడా ఇబ్బంది పెట్టని నాన్న, ఆఖరి క్షణాల్లో కూడా అలానే వెళ్లిపోయారు, మిస్ యూ నాన్న అంటూ తన తండ్రి గురించి చెబుతూ ఒక ఎమోషనల్ నోట్ కూడా ఆయన షేర్ చేసుకున్నారు.
Also Read: Akhanda Hindi: 'పఠాన్'ను టార్గెట్ చేయడానికే అఖండను ఇప్పుడు రిలీజ్ చేశారా?
Also Read: NTR 30 Launch: ఎన్టీఆర్ ఫాన్స్ పండుగ చేసుకునే న్యూస్.. ఇంటర్నేషనల్ కవరేజ్ పక్కా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook