Pushpa 2: పుష్ప 2 రిలీజ్ కు ముందే వైల్డ్ ఫైర్ మొదలైంది. కొన్నేళ్గుగా మెగాభిమానుల్లో అల్లు అభిమానులు వేరన్నట్టుగా తయారైంది పరిస్థితి. అప్పట్లో నిహారిక హీరోయిన్ గా నటించిన ‘ఒక మనసు’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గురించి అభిమానులు అడినపుడు చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అది మెగా వీరాభిమానులు, అల్లు అర్జున్ మధ్య పూడ్చలేని అగాథాన్ని మిగుల్చింది. ప్రస్తుతం మెగా , అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ సాగుతోంది. 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేనకు వ్యతిరేకంగా తన మిత్రుడు శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మెగా అభిమానులు.
అల్లు అర్జున్ వైఖరికి నిరసనగా ఇపుడు సరైన సమయం చూసి బై కాట్ పుష్ప 2 అని పిలుపు ఇస్తున్నారు మెగా వీరాభిమానులు. అటు మెగా అభిమానుల తీరుపై రగిలిపోతున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్. సోషల్ మీడియా వేదికగా ఎవరికి వారే తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోతున్నారు మెగా, బన్ని ఫ్యాన్స్.
పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ దూరంగా ఉంది. పుష్ప 2 పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నా కనీసం పట్టించుకోలేదు మెగా కుటుంబం. సాయి దుర్గ తేజ్ తప్పించి .. మెగా పెద్ద తలకాయలు ఎవరు అల్లు అర్జున్ కు మద్ధతుగా ఒక్క ట్వీట్ చేయకపోవడం గమనార్హం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎక్కడా మెగా హీరోల పేరును తలుచుకోలేదు అల్లు అర్జున్. పైగా ఏపీలో టికెట్ రేట్స్ పెంపుకు కృతజ్ఞతగా చంద్రబాబుకు , డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కు థాంక్స్ చెప్పడం మినహా పెద్దగా వారిని తలుచుకున్నది లేదు.
కనీసం మెగా స్టార్ చిరంజీవి పేరు కూడా బన్నీ ప్రస్తావించకపోవడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు మెగా ఫ్యాన్స్. చిరంజీవి లేకుంటే ఈ పుష్ప ఎక్కడి నుండి వచ్చారంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. తమ హీరో ఇమేజ్ చూసి తట్టుకోలేకే ఇందతా చేస్తున్నారని మండిపడుతున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. ఇప్పటికే మహబూబ్ బాద్ జిల్లా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాను బైకాట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు నిరసనగా తాము పుష్ప-2 సినిమాను బహిష్కరిస్తున్నామని తెలిపారు. అల్లు అర్జున్ తీరు జనసేన కార్యకర్తలను ఎంతగానో బాధించిందని చెప్పారు. ఇందుకు అల్లు అర్జున్ తగిన మూల్యం చెల్లించక తప్పదని మహబూబాబాద్ మెగా ఫ్యాన్స్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.