Pushpa 2 Updates: క్లైమాక్స్‌కు చేరిన పుష్ప 2 షూటింగ్, రష్మిక డెత్ మిస్టరీ ఎలా ఉంటుంది

Pushpa 2 Updates: పుష్ప మేనియా నుంచి కోలుకోకముందే మరోసారి ఆ మేనియా చుట్టేందుకు సిద్ధమౌతోంది. పుష్ప 2 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు త్వరలోనే ఆ గుడ్‌న్యూస్ అందనుంది. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ తుది దశకు చేరుకుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 4, 2023, 05:11 PM IST
Pushpa 2 Updates: క్లైమాక్స్‌కు చేరిన పుష్ప 2 షూటింగ్, రష్మిక డెత్ మిస్టరీ ఎలా ఉంటుంది

Pushpa 2 Updates: పుష్ప సినిమా దేశంలో ఎంతటి క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలుసు. పుష్ప డైలాగ్స్, పుష్ప మేనరిజం, పుష్ప పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. దేశమంతా ఓ మేనియా విస్తరించింది పుష్ప1 విడుదలైనప్పుడు. ఇప్పుడు పుష్ప 2పై అంతకంటే ఎక్కువ అంచనాలున్నాయి.

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా నటుడిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. మాస్ లుక్స్‌లో అదరగొట్టే నటనతో అందరి మన్ననలు పొందాడు. ఇప్పుడు పుష్ప 2లో అతని విశ్వరూపం చూసేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. బాక్సాఫీసు వద్ద పుష్ప1 భారీగా కలెక్షన్లు రాబట్టింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు మేనియాగా మారి దేశంలో వైరల్ అయ్యాయి. పుష్ప సినిమా పాటల స్టెప్పులు సెలెబ్రిటీలు అనుకరించేలా చేశాయి. ఇప్పుడు అందరి దృష్టి పుష్ప 2 సినిమాపై పడింది. పుష్ప 2 సీక్వెల్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. 

పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇక మిగిలింది క్లైమాక్స్ సీన్ ఒక్కటే. క్లైమాక్స్ కోసం భారీ సెట్టింగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే క్లైమాక్స్ సీన్ అంచనాలకు మించి ఉంటుందని అంటున్నారు. పుష్ప మొదటి భాగం కంటే రెండవ భాగమే హైలైట్ గా ఉండవచ్చని అంచనాలున్నాయి. సన్నివేశాలు, డైలాగ్స్, సెట్టింగులు అన్నీ ఇందుకు అనుగుణంగానే ఉంటున్నాయి. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కోసం పగడ్బందీగా లెక్కలేసుకున్నాడు. పుష్ప రెండవ భాగంలో పాత పాత్రలకు తోడు కొత్త పాత్రలు పరిచయం కానున్నాయి.

పుష్ప 2లో అతి ముఖ్యమైన సన్నివేశం ఇప్పుడు వైరల్ అవుతోంది. పుష్ప 2లో రష్మిక మరణం, డెత్ మిస్టరీ రెండూ ఉంటాయని తెలుస్తోంది. పుష్ప 2 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాణం జరుగుతోంది. 

Also read: Shah Rukh Khan Accident: షూటింగ్​లో షారుక్​కు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News