Dil Raju : అలా పిలిస్తే నన్ను తిడతాడు.. సాయి ధరమ్ తేజ్‌పై దిల్ రాజు కామెంట్స్

Producer Dilraju on Sai Dharam Tej నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు తాజాగా విరూపాక్ష సినిమా గురించి మాట్లాడాడు. నైజాం, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్‌గా ఈ ఈవెంట్‌కు వచ్చానని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక తేజు గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2023, 09:02 PM IST
  • బాక్సాఫీస్ వద్ద విరూపాక్ష సందడి
  • థాంక్యూ మీట్ పెట్టిన చిత్రయూనిట్
  • తేజుపై దిల్ రాజు కామెంట్స్ వైరల్
Dil Raju : అలా పిలిస్తే నన్ను తిడతాడు.. సాయి ధరమ్ తేజ్‌పై దిల్ రాజు కామెంట్స్

Producer Dilraju on Sai Dharam Tej సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు విరూపాక్ష సినిమాతో మంచి ఫాంలోకి వచ్చాడు. అయితే విరూపాక్ష సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ అవ్వడం, ఆ సినిమాను నైజాం, వైజాగ్‌ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు కూడా హ్యాపీగా ఉన్నాడు. తాజాగా ఈ మూవీ సక్సెస్‌ను థాంక్యూ మీట్ రూపంలో చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. విరూపాక్ష గురించి, హీరో తేజు గురించి చెప్పుకొచ్చాడు.

సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూట్ చేశాడని విన్నాను.. ఆయన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి కొనేశాడని తెలుసుకున్నాను.. అంటే సినిమా మీద ఎంత ప్యాషన్, జడ్జ్మెంట్ ఉందో అర్థమైంది.. నేను కూడా కెరీర్ ప్రారంభంలో అలానే ఉన్నాను.. అంటూ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నాడు దిల్ రాజు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను అనుకోలేదు.. ఈ క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్‌ కార్తీక్‌కే ఇస్తాను అని అన్నాడు.

ఫస్ట్ టైం డైరెక్టర్‌గా ఈ సినిమాను ఇంత వరకు తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత మంది ఎలా హింసించి ఉంటాడో నాకు తెలుసు.. కొత్త డైరెక్టర్ అయినా కూడా టీం అంతా ఎంతో సపోర్ట్ చేసి ఉంటుంది.. అందుకే ఇంత మంచి సినిమాను తీయగలిగాడు.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసిన మా నిర్మాత బాపీకి థాంక్స్ అని ఇలా దిల్ రాజు చెబుతూ వెళ్లాడు. ఇక ఇందులో సంయుక్తను హీరోయిన్ అనాలా? విలన్ అని అనాలా? అన్నది తెలియడం లేదు.. ఆ విషయంలోనూ డైరెక్టర్‌కే క్రెడిట్ ఇస్తాను అని అన్నాడు దిల్ రాజు.

Also Read: Anchor Manjusha : అందమంతా మంజూష దగ్గరే ఉన్నట్టుందే.. ఆహా అనిపించేలా యాంకర్.. పిక్స్ వైరల్

మై హీరో అని అంటే తేజు నన్ను తిడతాడు.. మై బాయ్ అని అనమంటాడు.. ఇప్పటికే మేం మూడు సినిమాలు తీశాం.. ఇప్పుడు వీళ్లు కెరీర్ హయ్యస్ట్ ఇచ్చారు.. మళ్లీ మేం కలిసి చేస్తే.. దాన్ని మించేలా చేయాల్సి ఉంటుంది.. నాకు పెద్ద టార్గెట్ పెట్టారు అని దిల్ రాజు అందరినీ నవ్వించాడు.

Also Read:  Rajamouli : ఎంత ప్రయత్నించినా లోపలకు వెళ్లనివ్వలేదు.. నాటి ఘటనపై నోరువిప్పిన రాజమౌళి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News