Priya Prakash Varrier: మళ్లీ ట్రెండ్ అవుతున్న ప్రియా వారియర్ వీడియో

ప్రియా ప్రకాశ్ వారియర్ మరో వీడియో ఇప్పుడు వైరల్ ( Viral Video ) అవుతోంది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మళ్లీ కుర్రకారు మనసులను కొల్లగొట్టేస్తోంది ప్రియా.

Last Updated : Sep 25, 2020, 08:28 PM IST
    • ప్రియా ప్రకాశ్ వారియర్ మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
    • తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మళ్లీ కుర్రకారు మనసులను కొల్లగొట్టేస్తోంది ప్రియా.
    • తన యూట్యూబ్ ఛానెల్ లో ప్రియా ప్రకాశ్ వారియర్ స్వయంగా ఈ వీడియోను షేర్ చేసింది.
Priya Prakash Varrier: మళ్లీ ట్రెండ్ అవుతున్న ప్రియా వారియర్ వీడియో

ప్రియా ప్రకాశ్ వారియర్ మరో వీడియో ఇప్పుడు వైరల్ ( Viral Video ) అవుతోంది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మళ్లీ కుర్రకారు మనసులను కొల్లగొట్టేస్తోంది ప్రియా. తన యూట్యూబ్ ఛానెల్ లో ప్రియా ప్రకాశ్ వారియర్ స్వయంగా ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె హిందీ మూవీ ఏ దిల్ హే ముష్కిల్ ( Ae Dil Hai Mushkil ) మూవీలోని చన్నా మేరేయా సాంగ్ పాడుతూ కనిపిస్తుంది. 

ALSO READ| Gold Monetisation Scheme: లాకర్ లో ఉన్న మీ బంగారంతో డబ్బు సంపాదించండి

ఎక్స్ ప్రెషన్ క్వీన్ ప్రియా ప్రకాశ్ (Priya Prakash Varrier ) సింగింగ్ చేస్తూ కనిపించడం ఇది తొలిసారి. దీంతో ఆమె అభిమానులు ఆమె పాట పాడిన విధానానికి ఫ్లాట్ అవుతున్నారు. ఈ వీడియో కేవలం 5 రోజుల పాతది అయినా మంచి వ్యూస్ సంపాదించింది. దాదాపు ఇప్పటి వరకు లక్షా 25 వేల మంది వీక్షించారు.

నిత్యం కొత్త స్టైల్లో...
ప్రియా ప్రకాశ్ బయటి ప్రపంచానికి కనిపించిన ప్రతీసారి కొత్తదనం చూపిస్తుంది. ఆమె అప్పియరెన్స్ ఫ్యాన్స్ మనసులు కొల్లగొడుతుంది. ఇంతకు ముందు వింక్ అండ్ ఫెయిర్ గన్ స్టైల్ ( Wink And Fair Gun ) తో రాత్రికి రాత్రే సోషల్ మీడియా క్వీన్ గా అవతరించింది. అల్లు అర్జున్ ( Allu Arjun ) వంటి స్టార్స్ కూడా ఆమెను మెచ్చుకున్నారు. వింక్ వీడియో ప్రపంచవ్యాప్తంగా బాగా షేర్ అయింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో 70 లక్షల మంది ఆమెను ఫాలో అవడం ప్రారంభించారు.

ALSO READ|  SP Balasubrahmanyam Facts: గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గురించి ఎవరికీ తెలియని విషయాలు

బాలీవుడ్ లో..
ఇటీవలే ప్రియా ప్రకాశ్ వారియర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. లగాన్ లోని రాధాకైసేన జలే సాంగ్ పాటతో ఫ్యాన్స్ ను బాగా ఎంట్ టైన్ చేసింది ప్రియా. ఓదు ఆడు లవ్ ( Oru Adu Love ) మూవీలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. శ్రీదేవి బంగ్లో ( Sridevi Bangalo ), లవ్ హ్యాకర్స్ (Love Hackers ) మూవీతో బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేయనుంది ఆ చిన్నది. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News