Salaar తర్వాత NTR తో ప్రశాంత్ నీల్ సినిమా !

KGF movie భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత దక్షిణాదిన ఈ తరం దర్శకులలో రాజమౌళి తర్వాత మళ్లీ అంతటి టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు Prashanth Neel అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ సక్సెస్‌తో పాటు KGF 2 మూవీకి ఏర్పడిన భారీ హైప్ చూసిన స్టార్ హీరోలు ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Last Updated : Feb 11, 2021, 07:55 PM IST
Salaar తర్వాత NTR తో ప్రశాంత్ నీల్ సినిమా !

KGF movie భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత దక్షిణాదిన ఈ తరం దర్శకులలో రాజమౌళి తర్వాత మళ్లీ అంతటి టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు Prashanth Neel అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ సక్సెస్‌తో పాటు KGF 2 మూవీకి ఏర్పడిన భారీ హైప్ చూసిన తర్వాత స్టార్ హీరోలు ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం Prabhas తో సలార్ మూవీ చేస్తున్న ప్రశాంత్ నీల్.. ఆ తర్వాత ఏ హీరోను ఎంచుకోనున్నాడనేదే అటు హీరోలను, ఇటు వారి అభిమానుల మెదళ్లను తొలిచేస్తోంది.

ఇదిలావుంటే, కేజీఎఫ్ 2 మూవీ ఇంకా పూర్తి కాకముందే, ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను అధికారికంగా ప్రకటించడానికంటే ముందు నుంచే ప్రశాంత్ నీల్ ఆసక్తి చూపిస్తున్న తెలుగు హీరోల పేర్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు కూడా వినిపించింది. దాదాపు ఏడాది క్రితమే Jr NTR, Prashanth Neel కాంబోలో మూవీపై చర్చ జరిగింది. ఫిలింనగర్ అప్‌డేట్స్ ప్రకారం ఒకవేళ ఎన్టీఆర్ కానీ అప్పటికే త్రివిక్రమ్‌తో సినిమాకు సైన్ చేసి ఉండకపోయుంటే... ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న Salaar Movie స్థానంలో ఎన్టీఆర్‌తో సినిమానే సెట్స్‌పైకి వెళ్లి ఉండేదని తెలుస్తోంది.

Also read : అందాల రాశి Rashi Khanna స్విమ్మింగ్ ఫూల్ photo shoot

ప్రస్తుతం RRR movie తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ సినిమాను పూర్తి చేసుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించనున్నాడు. త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యేలోగా ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్‌తో Salaar movie పూర్తి చేసుకోనున్నాడు. ఆ తర్వాత వెంటనే Prashanth Neel, Jr Ntr ల కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కుతుందని ఆ చిత్రాన్ని నిర్మించనున్న మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు. Uppena movie ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాతలు నవీన్, రవి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూసేవాళ్లంతా అప్పటి వరకు వేచిచూడక తప్పదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News