HanuMan: ప్రతి సంక్రాంతికి పోటీ షురూ…కన్ఫామ్ చేసిన ప్రశాంత్ వర్మ

Prasanth Varma Cinematic Universe: హనుమాన్ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల చిత్రాలు విడుదల కాగా ఆ మూడు సినిమాల కన్నా కూడా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమాకి ప్రేక్షకులు జేజేలు పలికారు…

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2024, 07:00 AM IST
HanuMan: ప్రతి సంక్రాంతికి పోటీ షురూ…కన్ఫామ్ చేసిన ప్రశాంత్ వర్మ

HanuMan Collections: సంక్రాంతి అంతే చాలు అందరికీ పండగ గుర్తొస్తే సినీ ప్రేక్షకులకు మాత్రం సినిమాలు గుర్తొస్తాయి. స్టార్ హీరోలు సైతం సంవత్సరం మొత్తం తమ సినిమా షూటింగ్ జరుపుకుంటూ సంక్రాంతికి విడుదల చేయాలి అని పెద్ద ఎత్తున కోరుకుంటూ ఉంటారు. అందుకే సంక్రాంతి విడుదల సమయంలో నిర్మాతలకు.. డిస్ట్రిబ్యూటర్లకు ఏదో ఒక చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. స్టార్ హీరోలకు సైతం థియేటర్స్ దక్కించుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ప్రశాంత్ వర్మ ముగ్గురు స్టార్ హీరోల మధ్య తన హనుమాన్ చిత్రం విడుదల చేసి.. మొదట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొని చివరిగా సూపర్ హిట్ కొట్టాడు.

ఇక ఇప్పుడు ఏకంగా మరో దైర్యమైన నిర్ణయం బయటపెట్టారు ఈ డైరెక్టర్. అదేమిటంటే ఈ సంవత్సరం మాత్రమే కాదు…ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఒక సూపర్ హీరో సినిమాతో వస్తానని తన నిర్ణయం బయటపెట్టారు ఈ దర్శకుడు. “హనుమాన్ చుట్టూ చాలా ఉపకథలు ఉన్నాయి. ‘నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న’ అని ఈ సినిమాలో విభీషణుడి పాత్ర చెబుతుంది. మరి హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటి అనేది తర్వాత భాగంలో చూస్తారు. ఈ హనుమాన్ సినిమా కేవలం మొదటి భాగం మాత్రమే. ఈ చిత్రానికి సీక్వెల్స్ అలానే ఫ్రీక్వెల్స్ కూడా చేయాలనే ఆలోచనలో నేను ఉన్నాను. ఈ చిత్రం మొదలుపెట్టినప్పుడు సముద్రఖని పోషించిన విభీషణుది పాత్ర లేదు. కానీ ఈ చిత్రానికి సీక్వెల్స్  తీయాలి అనుకున్నప్పుడే ఆ పాత్రను క్రియేట్ చేసాం. నా దగ్గర ప్రస్తుతం 12 మంది రైటర్స్ ఉన్నారు. నా దగ్గర ఉన్నవాళ్లు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని అందరికీ జీతాలు ఇస్తున్నాను. వాళ్లందరికీ వచ్చిన ఆలోచనలను చర్చించి చివరికి బెస్ట్ డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నాము’’ అని తెలియజేశారు.

“హనుమాన్ లో విలన్ పాత్ర ఇంకా బాగా చూపించి ఉండొచ్చు. కానీ మా దగ్గర ఉన్న పరిమితి బడ్జెట్ వల్ల.. వచ్చే పార్ట్ కోసం వాటిని దాచిపెట్టం. హనుమాన్ స్టోరీ తో పోలిస్తే తర్వాత రాబోయే జై హనుమాన్ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. జై హనుమాన్ లో కూడా తేజ ఉంటారు కానీ పూర్తిగా కనిపించడు. కొత్త హీరోలు తెరపైకి వస్తారు. ఆ చిత్రం గురించి పూర్తి వివరాలు కావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి. ముందుగా నేను తియ్యాలనుకునింది జై హనుమాన్ సినిమానే. కానీ ముందుగా హనుమాన్ తీసాను. నేను దర్శకత్వం వహించే ఏ సినిమా కూడా చిత్రీకరణ పూర్తయ్య వరకు రిలీజ్ డేట్ ప్రకటించద్దని నిర్మాతకు చెపుతూ ఉంటాను. కల్కి విషయంలో జరిగిన తప్పు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్న. ఎందుకంటే ముందుగా విడుదల తేదీ ప్రకటిస్తే నేను అందుకు తగినట్లు పనిచేయడం కష్టమవుతుంది. అలానే హనుమాన్ వచ్చే వరకు ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రకటించకూడదు అని కూడా అనుకున్నాను. ఈ యూనివర్స్ సంబంధించి మొత్తం నా దగ్గర 20 స్క్రిప్టులు ఉన్నాయి. ముందుగా ఆరుగురు సూపర్ హీరోల పైన సినిమాలు తీస్తాం. వీటికి సంబంధించిన వివరాలు చెప్పడానికి మరి కాస్త సమయం ఉంది. ఈ యూనివర్స్ లో నాతోపాటు కొత్త దర్శకులు కూడా పరిచయమవుతారు” అని తెలియజేశారు.

ఇక ఆ తర్వాత మాట్లాడుతూ..ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతి సంక్రాంతికి ఒక మూవీ వస్తుందని.. జై హనుమాన్.. అదిరా..తోపాటు సూపర్ ఉమెన్ కథలు కూడా త్వరలో వస్తాయి అని.. ప్రస్తుతం మాత్రం మూడు సినిమాలను రెడీ చేస్తున్నామని.. ఇక ఈ యూనివర్స్ తో సంబంధం లేకుండా వేరే సినిమా కూడా తను చేస్తున్నానని.. అది దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. మరో నెల రోజుల్లో ఆ సినిమా పూర్తి చేసి.. వివరాలు చెబుతా అని చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ. 

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News