Prakash Raj: 'పెద్దల ఆశీర్వాదం నొకొద్దు.. సత్తా ఉన్నవాడే అధ్యక్షుడిగా గెలవాలి'..

MAA Elections 2021: ‘'మా'’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ ప్రచార కార్యక్రమాల్లో జోరుపెంచారు. ఈ’ ఎన్నికల్లో పెద్దల ఆశీర్వాదం తనకి వద్దని.. పెద్దవాళ్లను సైతం ప్రశ్నించే సత్తా ఉన్నవాడే ‘మా’ అధ్యక్షుడిగా గెలవాలని ప్రకాశ్‌రాజ్‌  పేర్కొన్నారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2021, 02:09 PM IST
  • జోరుగా 'మా' ఎన్నికల ప్రచారం
  • నరేశ్‌పై ప్రకాశ్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు
  • నరేశ్‌ అహంకారి అని ప్రకాశ్ రాజ్ మండిపాటు
Prakash Raj: 'పెద్దల ఆశీర్వాదం నొకొద్దు.. సత్తా ఉన్నవాడే అధ్యక్షుడిగా గెలవాలి'..

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల(MAA Elections 2021) ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌ రాజ్‌ (PrakashRaj) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా అసోసియేషన్‌ సభ్యులతో తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో విష్ణు ప్యానల్‌(Vishnu panel), నరేశ్‌లపై ఆయన మండిపడ్డారు. ఈ సారి జరగనున్న ‘మా’ ఎన్నికల్లో పెద్దల ఆశీర్వాదం తనకి వద్దని.. పెద్దవాళ్లను సైతం ప్రశ్నించే సత్తా ఉన్నవాడే ‘మా’ అధ్యక్షుడిగా గెలవాలని పేర్కొన్నారు. ఆ సత్తా తనకి ఉందని.. అందుకే తాను ఈ సారి ఎన్నికల్లో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

'నరేష్ అహంకారి, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. మా అసోసియేషన్ సిగ్గుపడేలా నరేష్(Naresh) ప్రవర్తిస్తున్నారు. నన్ను తెలుగువాడు కాదన్నారు. కానీ నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్‌లో ఎవరికి రాదు. నన్ను పెంచింది తెలుగు భాష. మా’ అసోసియేషన్‌ కోసం బాధ్యతతో పనిచేయాలని వచ్చానని' ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

Also Read: MohanBabu: సినీ పరిశ్రమలో పెద్దలెవరూ లేరు: మోహన్‌బాబు

'మా సభ్యుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంది. చాలా బాధతో, ఆక్రోశంతో సమస్యలను పరిష్కరించాలని పోటీ చేస్తున్నాం. మీరు గెలవడానికి ప్రయత్నించండి, అవతలివారిని ఓడించడానికి కాదంటూ మంచు విష్ణుకు పరోక్షంగా ఆయన కౌంటర్‌ వేశారు. ఓట్ల సునామీలో మంచు విష్ణు ప్యానల్‌ కొట్టుకుపోతుంది'’ అని ప్రకాశ్‌ రాజ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News