Salaar updates: ప్రభాస్ 'సలార్' లాంచింగ్‌ అప్‌డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైన్ చేసిన అప్‌కమింగ్ సినిమాల్లో సలార్ మూవీ ఒకటి అని చెప్పడం కంటే... ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఎంతో మంది ఇండియన్ సినిమా ఆడియెన్స్ సైతం ఎదురుచూస్తున్న సినిమా ఇది అని చెప్పొచ్చు.

Last Updated : Jan 15, 2021, 01:21 AM IST
Salaar updates: ప్రభాస్ 'సలార్' లాంచింగ్‌ అప్‌డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైన్ చేసిన అప్‌కమింగ్ సినిమాల్లో సలార్ మూవీ ఒకటి అని చెప్పడం కంటే... ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఎంతో మంది ఇండియన్ సినిమా ఆడియెన్స్ సైతం ఎదురుచూస్తున్న సినిమా ఇది అని చెప్పొచ్చు. అందుకు కారణం.. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా ఫాలోయింగ్ ఉన్న హీరో నటిస్తున్న సినిమా కావడం అందుకు ఒక కారణం అయితే.. కేజీఎఫ్ ఛాప్టర్ 1, కేజీఎఫ్ 2 లాంటి భారీ ప్రాజెక్టులను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను డైరెక్ట్ చేయనుండటం మరో కారణంగా ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. 

ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) ఇటీవలే ప్రకటించిన సలార్ మూవీ షూటింగ్ ఈ నెల చివర్లో ప్రారంభం కానుంది. అయితే, అంతకంటే ముందుగా కనుమ పర్వదినం సందర్భంగా జనవరి 15న సలార్ సినిమాను లాంచ్ చేసేందుకు మూవీ యూనిట్ మూహూర్తం ఖరారు చేసుకుంది. కేజీఎఫ్ సీక్వెల్ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబేల్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాలో ప్రభాస్ ( Prabhas ) సరసన నటించబోయే హీరోయిన్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. 

Also read : Malaika Arora to tie knot: రెండో పెళ్లికి సిద్ధమైన మలైకా అరోరా

సలార్ మూవీ ( Salaar movie ) తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో విడుదల కానుండటంతో హీరోయిన్ సైతం ప్యాన్ ఇండియా ఫేస్ అయ్యుంటే బాగుంటుందనే ఉద్దేశంతో సాహో సినిమా తరహాలోనే బాలీవుడ్ బ్యూటీ పేర్లనే పరిశీలిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News