Prabhas Professional Ethics: తీవ్ర విషాదంలోనూ ప్రభాస్ వృత్తి ధర్మం.. నిర్మాతలకు అభయమిస్తూ!

Prabhas to resume shootings next week despite tragedy in family: కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నా తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 22, 2022, 10:22 AM IST
Prabhas Professional Ethics: తీవ్ర విషాదంలోనూ ప్రభాస్ వృత్తి ధర్మం.. నిర్మాతలకు అభయమిస్తూ!

Prabhas to resume shootings next week despite tragedy in family: ఈ మధ్యకాలంలో చాలా మంది తెలుగు హీరోలను ఇతర భాషల హీరోలను కంపేర్ చేస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వారు నార్త్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరవడానికి కారణం ప్రెస్ ముందు వారు చూపించే వినయం, ఏదైనా షోలలో వారు నడుచుకునే తీరు వారందరికీ బాగా నచ్చిందనే వాదన వినిపిస్తోంది. అయితే ఆ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు మన హీరోల వృత్తి ధర్మాన్ని చూస్తుంటే అందరికీ ముచ్చటేసే పరిస్థితి కనిపిస్తోంది.

సాధారణంగా ఎవరింట్లో అయినా దగ్గర వారు చనిపోతే వారు కోలుకొని మళ్ళీ పని మొదలు పెట్టడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది మన హీరోల కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారు ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్ళు ఇంట్లోనే ఉండి కాస్త కుదుట పడి తర్వాత షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మన హీరోల లెవెల్ పెరిగిపోయి రేంజ్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో వాళ్లు చేస్తున్న అన్ని సినిమాలు భారీ స్థాయిలోనే ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలో తన పెదనాన్న చనిపోయి పది రోజులు కూడా కాకముందే ప్రభాస్ షూటింగ్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం కృష్ణంరాజు కుటుంబాన్ని మాత్రమే కాదు టాలీవుడ్ మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. కృష్ణంరాజు మరణంతో ఇప్పుడు ప్రభాస్ కి బాధ్యతలు పెరిగాయి. కృష్ణంరాజు పెద్దకర్మను ఆయన సొంత ఊరు మొగల్తూరులో చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

అయితే మరోపక్క ప్రభాస్ ఆది పురుష్, సలార్, ప్రాజెక్టుకే వంటి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆది పురుష్ షూటింగ్ పూర్తికాగా, సలార్ సినిమా షూటింగ్ కోసం ప్రశాంత్ నీల్ రామోజీ ఫిలిం సిటీలోనే ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఏకంగా అక్కడ 12 సెట్లు నిర్మించారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండటంతో ప్రభాస్ ఎప్పుడు వస్తే అప్పుడు షూటింగ్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని ఉద్దేశంతో ప్రశాంత్ నీల్ రామోజీ ఫిలిం సిటీ లోనే తీష్ట వేసి కూర్చున్నట్లు తెలుస్తోంది.

అది కాక ప్రశాంత్ ప్రభాస్ కోసం ఈ సెట్లు అన్ని ఎదురుచూస్తున్నాయని, ఎలాగో నిర్మాణం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు షూటింగ్ జరిగినా జరగకపోయినా ఆ సెట్లకు, రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యానికి రోజులు లెక్కన డబ్బులు కడుతూనే ఉండాలి. దీంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని ప్రభాస్ చెవిన పడిందట. దీంతో త్వరలోనే తాను షూటింగ్ కి వస్తానని త్వరగా ప్రారంభించి పూర్తి చేద్దామని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.

Also Read: Chennakesava Reddy Re Release: రికార్డుల బద్దలు దిశగా చెన్నకేశవ రెడ్డి రీ రిలీజ్!

Also Read: Venkatesh Maha with Nani: లవ్ స్టోరీ చెప్పిన వెంకటేష్.. డైలమాలో నాని?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News