Radhe Shyam in Zee Telugu: జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ 'రాధేశ్యామ్'. ఎన్నో సార్లు వాయిదా పడి ఈ ఏడాది మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించుకున్న రాధేశ్యామ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రంగం సిద్దమైంది. వరుస బ్లాక్ బస్టర్ టెలివిజన్ ప్రీమియర్స్ తో వీక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచుతున్న 'జీ తెలుగు', ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు 'రాధే శ్యామ్' సినిమాతో మీ ముందుకు రానుంది.
అందమైన లొకేషన్స్ లో చిత్రీకరింపబడి, వినసొంపైన మ్యూజిక్ తో, మనస్సుని హత్తుకునే సన్నివేశాలతో, ఈ ప్రేమకథ ప్రేక్షకులకు ఈ వీకెండ్ మంచి ఫీల్ కలిగించబోతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 'రాధే శ్యామ్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ను పురస్కరించుకుని 'జీ తెలుగు' వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా, ప్రభాస్ అభిమానులకు కంచుకోటగా ఉన్న భీమవరంలో జూన్ 18న ఆహ్లాదకరమైన 'రాధే శ్యామ్ థీమ్ పార్క్' ను ఏర్పాటు చేసి, అభిమానుల సందడి మధ్య ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ డేట్ అండ్ టైం ఫాన్స్ ద్వారా ప్రకటింపజేసింది.
ఈ సందర్భంగా ఫోన్ ద్వారా మాట్లాడిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి, అభిమానులు 'రాధే శ్యామ్' చిత్రాన్ని థియేటర్లలో ఎంతగానో ఆదరించారని, ఇప్పుడు 'జీ తెలుగు' లో కూడా అలాగే ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసే ఒక అద్భుతమైన దృశ్యకావ్యమని, ఇంతకుముందు చూడని వారు, చూసిన వారు కూడా ఇప్పుడు టీవీలో చూసి ఒక గొప్ప అనుభూతిని పొందాలని ఆవిడ కోరారు. ఇక ఈ థీమ్ పార్క్ అభిమానులకు సినిమాలో పలు దృశ్యాలను అనుకరించే అవకాశం కల్పించింది జీ తెలుగు. దీంతో భీమవరంలో 'రాధే శ్యామ్' సందడి నెలకొంది. అలాగే ప్రేక్షకుల కోసం 'జీ తెలుగు' ఫ్లేమ్స్ (FLAMES) అనే టెక్ ఇన్నోవేషన్ గేమ్ ను కూడా ప్రమోషన్స్ లో భాగంగా ప్రారంభించింది. zeetelugu.tv కి వెళ్లి మీ ఫ్లేమ్స్ చెక్ చేసుకోవచ్చు. థియేటర్లో మిశ్రమ టాక్ అందుకున్న ఈ సినిమా.. బుల్లితెర మీద ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.
Also Read: Zee Telugu Dance India Dance : ఇక తెలుగులో..రేపటి నుంచే ఆడిషన్స్.. ఎలా అప్ప్లై చేయాలంటే?
Also Read: Actor Naresh: వార్తలపై స్పందించిన నరేష్... పద్దతి కాదంటూ వివరణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook