Radhe Shyam Review: అప్పట్లో శివ.. ఇప్పుడు రాధేశ్యామ్! ప్రభాస్ ఇక పాన్ ఇండియా స్టార్ కాదు..!!

Prabhas, Pooja Hegde Radhe Shyam Film Twitter Review. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7010 స్క్రీన్స్‌లో రాధేశ్యామ్ సినిమా ఈరోజు విడుదల అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 08:22 AM IST
  • మార్చి 11న రాధేశ్యామ్‌ విడుదల
  • అప్పట్లో శివ.. ఇప్పుడు రాధేశ్యామ్
  • ప్రభాస్ ఇక పాన్ ఇండియా స్టార్ కాదు
Radhe Shyam Review: అప్పట్లో శివ.. ఇప్పుడు రాధేశ్యామ్! ప్రభాస్ ఇక పాన్ ఇండియా స్టార్ కాదు..!!

Prabhas, Pooja Hegde's Radhe Shyam Movie Twitter Review: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా కోసం రెబల్‌ స్టార్‌ అభిమానులు మాత్రమే కాదు భారత్‌లోని మూవీ లవర్స్‌ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రం కావడంతో భారీ హైప్ నెలకొంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రాధేశ్యామ్.. దాదాపు నాలుగేళ్ల పాటు షూటింగ్‌ జరుపుకుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు శుక్రవారం (మార్చి 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7010 స్క్రీన్స్‌లో రాధేశ్యామ్ సినిమా ఈరోజు విడుదల అయింది. ఓవర్సీస్‌తో పాటు  పలుచోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడ్డాయి. ఉదయం నాలుగు గంటలకే స్పెషల్ షోలు పడ్డాయి. దాంతో ప్రభాస్ ఫాన్స్ తెగ సందడి చేశారు. సినిమా చూస్తూ ఈలలు, కేకలు వేశారు. ఇక రాధేశ్యామ్ సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమతమ అభిప్రాయాలను పంచుకున్నారు. 

'అప్పట్లో శివ.. ఇప్పుడు రాధేశ్యామ్' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'ప్రభాస్ ఇక పాన్ ఇండియా స్టార్ కాదు..పాన్ వరల్డ్ స్టార్' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. రాధేశ్యామ్ సినిమాలో విజువల్స్‌ అదిరిపోయాయి.. ప్రభాస్‌ లుక్స్‌, యాక్టింగ్‌ సరికొత్తగా ఉంది.. ప్రభాస్‌, పూజా హెగ్డే కెమిస్ట్రీ బాగుంది.. డీసెంట్ ఫస్ట్ హాఫ్, ఎక్సలెంట్ సెకండ్ హాఫ్.. సూపర్ క్లాసీ మూవీ..  తమన్‌ బీజీఎం ఔట్ స్టాండింగ్, ప్రభాస్ కెరీర్‌లో బెస్ట్ యాక్టింగ్ అని ఫాన్స్ అంటున్నారు. సినిమాకు 8/10, 9/10 రేటింగ్ ఇస్తున్నారు. 

1970 నాటి వింటేజ్ ప్రేమ కథతో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రభాస్‌కు జతగా స్టార్ హీరోయిన్ పూజా హగ్డే నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా.. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. రాజమౌళి వాయిస్ ఇచ్చారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ, జగపతి బాబు, సత్యరాజ్, సచిన్ ఖేడేకర్ మరియు ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాధేశ్యామ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల అయింది. 

Also Read: Radhe Shyam: అధికార పార్టీ నాయకుల ఇళ్ల నుంచి సినిమా టిక్కెట్లు.. థియేటర్ వద్ద ఆందోళనకు దిగిన ప్రభాస్ ఫాన్స్!!

Also Read: Horoscope Today March 11 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు గొడవలకు దూరంగా ఉండాలి! లేదా..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News