Radheshyam vs Kashmir Files: రాధేశ్యామ్‌కు హిందీలో..కశ్మీర్ ఫైల్స్ నుంచి ఎదురవుతున్న పోటీ

Radheshyam vs Kashmir Files: భారీ అంచనాలతో విడుదలైన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. సినిమా మిక్స్‌డ్ టాక్ ఉన్నా..మూడ్రోజుల్లో భారీగానే వసూళ్లు రాబట్టింది. ఆ వివరాలివీ..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 15, 2022, 06:15 AM IST
Radheshyam vs Kashmir Files: రాధేశ్యామ్‌కు హిందీలో..కశ్మీర్ ఫైల్స్ నుంచి ఎదురవుతున్న పోటీ

Radheshyam vs Kashmir Files: భారీ అంచనాలతో విడుదలైన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. సినిమా మిక్స్‌డ్ టాక్ ఉన్నా..మూడ్రోజుల్లో భారీగానే వసూళ్లు రాబట్టింది. ఆ వివరాలివీ..

ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మార్చి 11న విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. యు.వి. క్రియేషన్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, వంశీ-ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో విడుదలైంది. సినిమాపై ఉన్న భారీ అంచనాల్ని చేరుకోలేకపోయిందనే టాక్ విన్పిస్తోంది. మిక్స్‌డ్ టాక్ విన్పిస్తోంది. అయితే..కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. తొలి రెండ్రోజుల్లో 119 కోట్లు వసూలు చేసిన రాధేశ్యామ్..మూడ్రోజుల్లో 151 కోట్లు రాబట్టింది. 

ఈ సినిమా నిర్మాతలు..సోషల్ మీడియాలో చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రాధే శ్యామ్ తొలి వారాంతంలో 151 కోట్లు రాబట్టినట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. అయితే, బాక్స్ ఆఫీస్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, ఈ చిత్రం హిందీ వెర్షన్ ఇప్పటివరకు 14 కోట్లు మాత్రమే రాబట్టింది.

హిందీ సర్క్యూట్‌లో కశ్మీర్ ఫైల్స్ నుండి రాధే శ్యామ్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చిత్రం బాక్సాఫీస్ గణాంకాలను షేర్ చేశాడు. కశ్మీర్ ఫైల్స్ మూడవ రోజు కలెక్షన్లలో 325.35% పెరుగుదలతో పెద్దఎత్తున దూసుకుపోయిందని పేర్కొన్నారు. శుక్ర,శనివారాల్లో వరుసగా 3.55 కోట్లు, 8.50 కోట్లు రాబట్టిన కశ్మీర్ ఫైల్స్..ఆదివారం 15.10 కోట్లు వసూలు చేసింది. అలా ఇప్పటివరకు ఈ సినిమా టోటల్ కలెక్షన్ 27.15 కోట్లకు చేరింది. రాధేశ్యామ్ మాత్రం ఇంకా కలెక్షన్ల పరంగా జోరందుకోలేదు. సినిమా నెమ్మదిగా అక్కడి ప్రేక్షకుల్ని చేరుతుందో లేదో చూడాలి.

Also read: Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న 'కంచె' బ్యూటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News