Kalki 2898 AD: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... 'కల్కి' అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నయా మూవీ 'కల్కి 2898 ఏడీ'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ అనౌన్స్ చేశారు మేర్స్. మూవీ ఆడియెన్స్ ముందుకు రానుందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2024, 12:46 PM IST
Kalki 2898 AD: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... 'కల్కి' అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Kalki 2898 AD Release date fix: సలార్ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న మూవీ 'కల్కి 2898 ఏడీ '(Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ వంటి స్టార్ నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ ఓ రేంజ్ లో ఉంది. 

అయితే గత కొన్ని రోజులగా ఈమూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మే 09న తీసుకురాబోతున్నట్లు దీని సారాంశం. తాజాగా ఆ తేదీనే ఫిక్స్ చేస్తూ మేకర్స్ అఫీషియల్ ప్రకటించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో వచ్చి ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఇదే తేదీన విడుదల కావడం విశేషం. మరి ఆ సెంటిమెంట్ కల్కి వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి. విజయవాడలోని ఓ మల్టీప్లెక్స్‌లో రైడర్స్‌ గెటప్‌లో సినిమాను ప్రమోట్‌ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియెన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. కల్కి టీజర్‌కు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అంతేకాదు టీజర్‌ నిడివి 1 నిమిషం 23 సెకన్లు ఉంది. ఈ మూవీని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సీ అశ్వనీదత్‌ సుమారు 500 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కల్కి ట్రైలర్‌ను 2024 ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Hanuman Movie Review: హనుమాన్ మూవీ రివ్యూ.. థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం

Also Read: Guntur Karam Twitter Review: గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ.. మహేష్ బాబు మాస్ జాతర

.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News