Kalki 2898 AD Hindi Bookings: ‘కల్కి 2898 AD’ హిందీ బుకింగ్స్ ఎలా ఉన్నాయి.. ? బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే.. !

Kalki 2898 AD Hindi Bookings: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే తెలుగులో సాలిడ్ బుకింగ్స్ తో దుమ్ము రేపుతున్న ఈ మూవీ హిందీలో బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే.. ?

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 26, 2024, 12:58 PM IST
Kalki 2898 AD Hindi Bookings: ‘కల్కి 2898 AD’ హిందీ బుకింగ్స్ ఎలా ఉన్నాయి.. ? బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే.. !

Kalki 2898 AD Hindi Bookings: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ ప్యాన్ ఇండియా మార్కెట్ క్యాప్చర్ చేసుకున్నాడు. అంతేకాదు బాహుబలి నుంచి దాదాపు రెబల్ స్టార్ సినిమాలు యావరేజ్ ఉన్న దాదాపు రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను రాబడుతున్నాయి. ఇక యూఎస్ మార్కెట్ సహా తెలుగులో ఓ రేంజ్ లో దుమ్ము లేపుతున్న ప్రభాస్ కల్కి మూవీ.. హిందీలో నాన్ హాలీడే రోజైన గురువారం మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి. అంతేకాదు అక్కడ బుకింగ్స్ ఓపెన్ చేసినపుడు మంచి జోరు చూపిస్తోంది.

ఈ బుకింగ్స్ చూస్తుంటే.. ప్రభాస్ స్టార్ డమ్ అక్కడ కూడా ఓ రేంజ్ లో కనిపిస్తోంది. ఈ సినిమా బుకింగ్స్ చూస్తుంటే.. హిందీలో తొలి రోజు దాదాపు రూ. 20 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే.. ఈ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశాలున్నాయి.

ఇక్కడ కొన్ని మల్టీప్లెక్స్ లో ఈ సినిమా టికెట్స్ రూ. 2300 ఉంది. మరికొన్ని చోట్ల రూ. 1500 నుంచి 1700 వరకు ఉన్నాయి. అయినా.. అక్కడ ప్రేక్షకులు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ కొద్ది టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. చూస్తుంటే.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను ఈజీగా క్రాస్ చేసే అవకాశాలున్నాయి. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు టికెట్ రేట్స్ పెంపు అనేది పెద్ద ఎస్సెట్ గా నిలవనుంది. మొత్తంగా ఈ సినిమా తెలుగు సహా నార్త్ లో బాక్సాఫీస్ దగ్గర  ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.

ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు వెయ్యి రోజులు కేటాయించారు. ఫిబ్రవరి 2020లో కల్కి మూవీని అనౌన్స్ చేశారు. 2021 జూలై నుంచి 2024 వరకు కల్కి మూవీ షూటింగ్ జరిగింది. ఈ సినిమాను మహా భారత కాలం నుంచి సామాన్య శకం 2898 వరకు ఈ సినిమా స్టోరీ ఉండనుంది. శంబల, కాశీ, కాంప్లెక్స్ మూడు ప్రపంచాల మధ్య జరిగే స్టోరీతో ‘కల్కి 2898 AD’ మూవీ స్టోరీ ఉండనుంది.

Also read: Redmi Note 13 Pro: 108MP, 200MP కెమేరా, 12 జీబీ ర్యామ్‌తో రెడ్‌మి నోట్ 13 ప్రో విడుదల, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News