Prabhas Birthday: ‘రాధే శ్యామ్’ స్టన్నింగ్ స‌ర్‌ప్రైజ్ ఇదే..

ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) కు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ జన్మదినం (Prabhas Birthday) సందర్భంగా ఆయనకు సూపర్‌ స్టార్లతోపాటు సినీరంగం, పలు రంగాల ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదిక ద్వారా పెద్దఎత్తున (Happy Birthday Prabhas) శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన రాధేశ్యామ్ సినిమా సర్‌‌ప్రైజ్ (Radhe Shyam Movie surprise) సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Last Updated : Oct 23, 2020, 02:07 PM IST
Prabhas Birthday: ‘రాధే శ్యామ్’ స్టన్నింగ్ స‌ర్‌ప్రైజ్ ఇదే..

Prabhas Birthday: Watch Beats Of Radhe Shyam Video: ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్‌ (Prabhas) కు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ జన్మదినం (Prabhas Birthday) సందర్భంగా ఆయనకు సూపర్‌ స్టార్లతోపాటు సినీరంగం, పలు రంగాల ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదిక ద్వారా పెద్దఎత్తున (Happy Birthday Prabhas) శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ నటించే రాధేశ్యామ్ సినిమా సర్‌‌ప్రైజ్ (Radhe Shyam Movie surprise) కోసం దేశవ్యాప్తంగా అభిమానులు కళ్లప్పగించి చూస్తున్నారు. అయితే ఆ క్షణం రానే వచ్చింది. ముందు ప్రకటించినట్లుగానే ఈ రోజు ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న రాధే శ్యామ్ చిత్రానికి సంబంధించిన స‌ర్‌ప్రైజ్ వీడియోతోపాటు పోస్టర్‌ను సైతం శుక్రవారం విడుద‌ల చేశారు మూవీ మేకర్స్. 

బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ ( Beats Of Radhe Shyam ) పేరుతో విడుద‌లైన ఈ వీడియో వచ్చిరాగానే అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేసింది. ఈ వీడియలో అర‌చేతిలో అద్భుత ప్రపంచాన్ని చూపిస్తూ ప్ర‌భాస్, పూజా హెగ్డే ( Actress Pooja Hegde ) మ‌ధ్య సాగిన రొమాంటిక్ విజువ‌ల్స్‌తోపాటు జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (Justin Prabhakaran) అందించిన సంగీతం ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది. అయితే ఈ వీడియోలో పూర్వ జన్మకు సంబంధించిన చారిత్రాత్మక సందేశాన్ని.. ఆ తర్వాత మరుసటి జన్మ సందేశాన్ని సైతం చూపించారు. అయితే రాధే శ్యామ్‌లో ప్రభాస్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తున్నాడని అర్థమవుతోంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమదిత్యగా కనిపించనున్నాడు. 

ప్రభాస్‌ 20వ చిత్రం రాధే శ్యామ్‌ (Radhe Shyam) పీరియాడికల్‌ లవ్‌స్టోరిని రాధాకృష్ణ కుమార్ (Radha Krishna Kumar) తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాను రెబల్ స్టార్ క్రిష్ణం రాజు ప్రజెంట్ చేస్తుండగా.. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ఇటలీలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే కాకుండా ఇతర ప్రధాన పాత్రలలో సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతి బాబు, జయరామ్, సచిన్ ఖేద్కర్, భీనా బెనార్జీ, మురళి శర్మ, షాషా చెత్రి, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సత్యన్ తదితరులు నటిస్తున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన వీడియోతో మ్యూజిక్ డైరెక్టర్‌ సస్పెన్స్ కూడా వీడింది. అందరూ అనుకున్నట్లుగానే జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చనున్నారు. Also read: Tuck Jagadish shooting re-started: టక్ జగదీష్ షూటింగ్‌ మళ్లీ స్టార్ట్

 Also read: Navratri Day 7: శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News