F3 Movie: పోరితో సల్సా, రాత్తిరంతా జల్సా.. 'ఎఫ్‌ 3' స్పెష‌ల్ సాంగ్ ప్రోమో విడుద‌ల‌! పూజా హెగ్డే స్టెప్స్‌ అదుర్స్

F3 Movie special song promo released. ఇటీవలే ఎఫ్‌ 3 ట్రైల‌ర్ విడుదల చేసిన మేక‌ర్స్.. తాజాగా స్పెష‌ల్ సాంగ్ ప్రోమోను వదిలారు. 'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా' అంటూ సాగే స్పెషల్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 01:14 PM IST
  • మే 27న 'ఎఫ్‌ 3' విడుద‌ల
  • 'ఎఫ్‌ 3' స్పెష‌ల్ సాంగ్ ప్రోమో విడుద‌ల‌
  • పూజా హెగ్డే స్టెప్స్‌ అదుర్స్
F3 Movie: పోరితో సల్సా, రాత్తిరంతా జల్సా.. 'ఎఫ్‌ 3' స్పెష‌ల్ సాంగ్ ప్రోమో విడుద‌ల‌! పూజా హెగ్డే స్టెప్స్‌ అదుర్స్

Pooja Hegde's F3 Movie special song Life Ante Itta Vundaala promo released: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా  'ఎఫ్‌ 2'. ఈ సినిమా బాక్సాఫీక్ వద్ద భారీ హిట్ కొట్టింది. వెంకీ టైమింగ్.. తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాదా గ్లామర్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 2019లో సంక్రాంతి కానుక‌గా విడుద‌లై భారీ విజ‌యాన్ని అందుకున్న ఎఫ్‌ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్‌ 3 తెర‌కెక్కింది. సీక్వెల్‌లో సోనాల్ చౌహాన్ రూపంలో అదిరిపోయే గ్లామర్ కూడా తోడయింది. దాంతో ప్రేక్షకులు పండగ చేసుకోనున్నారు. 

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన 'ఎఫ్‌ 3' మే 27న విడుద‌ల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుసగా అప్‌డేట్‌లు ఇస్తూ వస్తోంది. ఇటీవలే ట్రైల‌ర్ విడుదల చేసిన మేక‌ర్స్.. తాజాగా స్పెష‌ల్ సాంగ్ ప్రోమోను వదిలారు. 'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా' అంటూ సాగే స్పెషల్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. 'హాత్ మే పైసా, మూతిపై సీసా, పోరితో సల్సా, రాత్తిరంతా జల్సా.. లైఫ్ అంటే ఇట్టా మినిమమ్ ఉండాలా' అనే లిరిక్ బాగుంది.

'లైఫ్ అంటే ఇట్టా ఉండాలా' సాంగ్ ప్రోమోలో వెంక‌టేష్‌, వ‌రుణ్‌ తేజ్, పూజా హెగ్డే సందడి చేశారు. ముగ్గురు కలిసి వేసిన చిందులు అభిమానులను అల‌రిస్తున్నాయి. ఈ సాంగ్ పూర్తి లిరిక‌ల్ వీడియో మే 17న విడుద‌ల కానుంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించ‌గా.. రాహుల్ సిప్లీగంజ్‌, గీతా మాధురి పాడారు. ఈ పాటలో పూజా హెగ్డే ఐటమ్ భామగా వేసిన స్టెప్స్ బాగున్నాయి. 

శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌ రాజు, శిరీష్‌లు 'ఎఫ్‌ 3' సినిమాను నిర్మించారు. వెంకటేష్, వ‌రుణ్‌ల‌కు జోడీగా త‌మ‌న్నా, మెహ‌రిన్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. సునీల్, సోనాల్‌ చౌహ‌న్‌లు కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు. నలుగురు హీరోయిన్స్ ప్రేక్షకులకు అందాల విందు చేయనున్నారు. గతవారం విడుదలైన ఎఫ్ 3 ట్రైలర్ భారీ అంచులను పెంచింది. మరి ఆ అంచనాలను ఏమాత్రం అందుకుంటుందో మే 27న చూడాలి. 

Also Read: Samantha-Vijay devarakonda: ఖుషి టైటిల్‌తో వస్తున్న సమంత, విజయ్‌.. ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది!

Also Read: Indian Railways: మీ రైలు ప్రయాణ తేదీని ఎలా మార్చుకోవాలి, అలా చేస్తే టికెట్ రద్దవుతుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News