Pooja Hegde : సినిమాలు ఫెయిల్.. నేను కాదు.. ఆచార్య, రాధే శ్యామ్‌లపై పూజా హెగ్డే కామెంట్స్

Pooja Hegde About Failures పూజా హెగ్డే తాజాగా తన ఫెయిల్యూర్ సినిమాల గురించి చెప్పుకొచ్చింది. పూజా హెగ్డేకు గత ఏడాది వరుసగా మూడు ఫ్లాపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆచార్య, రాధే శ్యామ్, బీస్ట్ ఇలా అన్ని సినిమాలు ఫ్లాపులుగానే నిలిచాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 10:09 AM IST
  • కొత్త సినిమాతో పూజా హెగ్డే సందడి
  • ఫెయిల్యూర్‌ల మీద పూజా హెగ్డే కామెంట్స్
  • అవకాశాలు వస్తున్నాయన్న పూజా పాపా
Pooja Hegde : సినిమాలు ఫెయిల్.. నేను కాదు.. ఆచార్య, రాధే శ్యామ్‌లపై పూజా హెగ్డే కామెంట్స్

Pooja Hegde Disaster Movies పూజా హెగ్డేకు ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయి. అప్పుడు టాలీవుడ్ లక్కీ ఛార్మ్, గోల్డెన్ లెగ్, గోల్డెన్ హ్యాండ్ అని పొగిడేశారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీ ఇలా అందరితోనూ హిట్లు కొట్టేసింది. అయితే గత ఏడాది మాత్రం పూజా హెగ్డేకు ప్రభాస్ రాధే శ్యామ్, చిరంజీవి ఆచార్య, విజయ్ బీస్ట్ సినిమాలతో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేశాయి.

ఒకప్పుడు మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురములో ఇలా వరుసగా హిట్లు కొట్టేసింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా నిలిచింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. అయితే ఒక్కసారిగా ఆమె స్పీడుకు బ్రేకులు పడ్డట్టు అయింది. కోలీవుడ్‌లోనూ పూజా హెగ్డేకు బీస్ట్ రూపంలో దెబ్బ కొట్టేసింది. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పూజా హెగ్డే మీద అంతగా ట్రోలింగ్ జరగలేదు. రాధే శ్యామ్‌లో కొన్ని చోట్ల బాగానే కనిపిస్తుంది. ఆచార్య వల్ల పూజకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.

బీస్ట్ సినిమాలో అయితే పూజా హెగ్డే అందంగా కనిపించి, డ్యాన్స్‌లతో మెప్పించింది. అలా బీస్ట్ సినిమా వల్ల పూజకు ప్లస్సే అయింది. ఇప్పుడు తన సినిమాల ఫెయిల్యూర్ మీద స్పందించింది. సినిమాలు ఫ్లాప్ అయ్యాయ్ కానీ తాను కాలేదు.. తన పర్ఫామెన్స్‌కు, డ్యాన్సులకు మంచి ప్రశంసలు దక్కాయని చెప్పుకొచ్చింది. ఈ సినిమాల వల్ల తనకు నష్టమేమీ జరగలేదని, ప్రతీది అనుభవం అని చెప్పుకొచ్చింది.

Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్

ఆ సినిమాల తరువాత కూడా తనకు ఆఫర్లు వచ్చాయని, అయితే ఒకప్పుడు తనకు వరుసగా ఆరు హిట్లు వచ్చాయని, ఒకటి రెండు ఫ్లాపులు వచ్చినంత మాత్రాన ఏం కాదని, ఇప్పుడు తాను కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నానని, త్వరలోనే మరిన్ని ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వివరాలు ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది.

తెలుగులో ప్రస్తుతం ఆమె ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే చేస్తోంది. మహేష్‌ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న SSMB 28 సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది. టాలీవుడ్ మేకర్లు పూజా హెగ్డేను దూరం పెట్టినట్టుగా అనిపిస్తోంది. రాధే శ్యామ్, ఆచార్య రిజల్ట్ ఆమె కెరీర్‌ను దెబ్బ కొట్టినట్టే కనిపిస్తోంది.

Also Read: Renu Desai Video : ఏడ్వాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు.. రేణూ దేశాయ్ పోస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News