హైదరాబాద్ : మహాత్మా గాంధీని హతమార్చిన నాథురాం గాడ్సే జయంతి నాడు గాడ్సే గురించి ఓ ట్వీట్ చేసిన సినీనటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ( Nagababu ).. గాడ్సే కూడా ఎంతో దేశభక్తి గలవాడేనని తన ట్వీట్‌లో పేర్కొనడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. నాగబాబు ట్విటర్ (Nagababu twitter ) ద్వారా వ్యక్తంచేసిన అభిప్రాయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. '' దీంతో గాంధీని అవమానించడం తన ఉద్దేశం కాదు'' అని వివరణ ఇస్తూ నాగబాబు మరో ట్వీట్ చేయాల్సి వచ్చింది. ఆ వివాదం ఇంకా పూర్తిగా సద్దుమణగకముందే మరోసారి గాంధీ పేరును ప్రస్తావిస్తూ... ఆయన బతికుంటే దేశభక్తులందరినీ గౌరవించాల్సిందిగా చెప్పేవారని మరో ట్వీట్ చేశారు. అంతేకాకుండా దేశం కోసం త్యాగం చేసిన వారి పేర్లు తప్ప ముఖాలు గుర్తుకురావడం లేదు. కరెన్సీ నోట్లపై వారి ముఖాలను ముద్రించి భావితరాలకు వారిని పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని నాగబాబు ట్విటర్ ద్వారా అభిప్రాయపడ్డారు. నాగబాబు చేసిన ట్వీట్ ఎప్పటిలాగే ఈసారి కూడా వివాదాస్పదమైంది. ( Nagababu`s tweet : మహాత్మా గాంధీపై మరో ట్వీట్ చేసిన నాగబాబు )
నాగబాబు చేస్తోన్న వరుస వివాదాస్పద ట్వీట్లపై తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) స్పందించారు. నాగబాబు జనసేన పార్టీ నేత ( Janasena Party ) కూడా కావడంతో ఆయన చేసే వ్యాఖ్యలు పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకముందే తేరుకోవాలని భావించిన పవన్ కల్యాణ్.. '' జనసేన నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని.. అలాగే గత మూడు రోజులుగా నాగబాబు చేస్తున్న వివాదాస్పద ట్వీట్స్ కూడా ఆయన వ్యక్తిగతమైనవే'' అని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో జనసేన పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న కొన్ని సున్నితమైన అంశాలపై వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారు. కానీ ఆ అభిప్రాయాలతో జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం పవన్ కల్యాణ్ మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. ( రానున్న 10 రోజుల్లో 2600 ప్రత్యేక రైళ్లు)
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus ) నేపథ్యంలో ప్రజలు నానాకష్టాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో వారికి సహాయం చేయడం తప్ప ఏ ఇతర అంశాల జోలికి పోకూడదని పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. కరోనాతో కష్టాలు పడుతున్న ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంలో ఇతర అంశాల గురించి మాట్లాడొద్దని పవన్ కల్యాణ్ జనసైనికులు, నేతలు, కార్యకర్తలకు చెప్పిన తీరు చూస్తోంటే... పరోక్షంగా నాగబాబును ఉద్దేశించే పవన్ కల్యాణ్ ఈ హెచ్చరిక చేశాడా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై సోషల్ మీడియాలో పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
నాగబాబుకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారా ?